జమిలి అప్పుడే పక్కా-వైసీపీ నేతలకు తేల్చేసిన జగన్..!
కడప జిల్లా టూర్ లో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో కార్యకర్తలతో భేటీ అయిన జగన్ జమిలి ఎన్నికలపై వారికి కీలక సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు ఎప్పుడొస్తాయి, వాటికి ఎలా సిద్దం కావాలన్న దానిపై జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో జగన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో వైయస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశామని వారికి గుర్తుచేశారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతామన్నారు. ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుందన్నారు. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు, అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ చేశామని వెళ్ళగలుగుతారా అని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే పరిస్ధితి ఉందని జగన్ తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారన్నారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయని నిలదీస్తారన్నారు.
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారని, నెలలు గడిచేకొద్ది చంద్రబాబులో భయం పెరిగిపోతుందని జగన్ గుర్తుచేశారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నామని, మన ప్రభుత్వం మళ్ళీ రాగానే తనతో పాటు ఈ కష్టాల్లో ఉన్నవారికి మంచిరోజులు వస్తాయన్నారు. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయని, ప్రలోభాలకు గురిచేసినా కొంత ఓపిక పట్టాలని కోరారు. తమ్ముడు అవినాష్ మీకు అందుబాటులో ఉంటారన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవాలని సూచించారు. తాను కడప బిడ్డను కాబట్టే మీరంటే ప్రత్యేకమైన అనుబంధం అన్నారు.












Click it and Unblock the Notifications