రోజాకు జగన్ ప్రాధాన్యతకిదే నిదర్శనం.. వారికి షాక్, వైసీపీ నుండి అవుట్!
మళ్లీ నగరిలో మాజీ మంత్రి రోజా దూకుడు రాజకీయాలను చేయనున్నారని తెలుస్తుంది. ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి తాను పార్టీలోనే కొనసాగుతున్నానని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మొన్నటివరకు వైసీపీకి గుడ్ బై చెప్పి తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగిన రోజా మళ్లీ వైసీపీలోనే కొనసాగుతానని అందరికీ అర్థమయ్యేలా చేశారు.
వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టిన రోజా
తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొన్న రోజా పార్టీ పరిస్థితిపై జగన్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ నేతలతో ఉన్న విభేదాలపైన జగన్ తో చర్చించిన రోజా ఫైనల్ గా తను అనుకున్నది సాధించారు. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టాలని భావించిన రోజా ఏకంగా వారిని పార్టీలోనే లేకుండా చేశారు.

కేజే దంపతులపై వేటు
నగరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నేతలు కే.జే కుమార్ ను ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి లను తాజాగా పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటన చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారని ఫిర్యాదుతో
నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మాజీ ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి ల పైన పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా పార్టీ కార్యాలయానికి లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని, దీనిపైన క్రమశిక్షణ కమిటీ విచారణ జరపగా వారిపై పేర్కొన్న అభియోగాలు అన్ని వాస్తవమని తేలిందని పేర్కొన్నారు.
పార్టీ సభ్యత్వాన్ని కూడా తొలగిస్తూ ప్రకటన
ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు వారిని పార్టీ నుంచి తొలగిస్తూ వారి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక మీద వారు చేసే కార్యక్రమాలతో, చట్ట విరుద్ధమైన పనులతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అనుకున్నది సాధించిన రోజా
గత ఎన్నికలలో రోజా ఓటమికి వీరే కారణమని రోజా పైన బహిరంగంగానే వీరు ఎప్పటికప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ నగరి నియోజకవర్గంలో రోజా ఇమేజ్ కు డామేజ్ చేశారని రోజా జగన్ మోహన్ రెడ్డి కి చెప్పినట్టు సమాచారం. ఇక వైయస్ జగన్ ను కలిసిన మరుసటిరోజే కేజే దంపతులపై వేటుపడడం రోజాకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. మొత్తానికి ఈ చర్యతో రోజా తాను అనుకున్నది సాధించారు. కేజే దంపతులకు చెక్ పెట్టారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications