నేనూ 'కామ బాబు' అన్నాను, టైంపాస్ కోసం బాబుకు రోజా గుర్తొచ్చింది: జగన్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ జరిగిన తీరును ఆయన తప్పుబట్టారు. సభలో ఎంపిక చేసుకొని రోజాను సస్పెండ్ చేశారని, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే కాల్ మనీ ఆగడాలు జరిగాయన్నారు. కాల్ మనీ వ్యాపారులకు సీఎం అండదండలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ కేవలం ఐదు రోజులే జరిపారని, ఇది సరికాదని చెప్పినా వినలేదన్నారు. కాల్ మనీ పైన అసెంబ్లీలో నిలదీయాలను మేం చూస్తే అధికార పక్షం పట్టించుకోలేదన్నారు.

అసెంబ్లీకి అసలు విలువ ఉందా అని ప్రశ్నించారు. సభలో ప్రజా సమస్యలు పట్టవా అన్నారు. వడ్డీలు కట్టకుంటే మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారని, అలాంటి కాల్ మనీ పైన చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడం ఏమిటన్నారు.

కాల్ మనీ - సెక్స్ రాకెట్లో అధికార పార్టీ నేతలు సహా చాలామంది ఉన్నారని, ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని, అలాంటి కాల్ మనీ పైన తాము వాయిదా తీర్మానం ఇస్తే చర్చకు అనుమతించలేదన్నారు. కాల్ మనీలో టిడిపి నేతలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ముద్దాయి అని, దానిని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందన్నారు.

తాము కాల్ మనీ గురించి అసెంబ్లీలో తీర్మానం ఇస్తే, అంబేడ్కర్ పైన చర్చ పేరుతో ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. అంబేడ్కర్‌ను కూడా చంద్రబాబు రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అన్నారు.

YS Jagan press meet about ap assembly sessions

కామ సీఎం అంటే.. మేం కూడా అన్నాం

అసెంబ్లీలో చంద్రబాబును రోజా మాత్రమే అనలేదని, ఆమెతో పాటు తాము అందరం అన్నామని జగన్ చెప్పారు. చంద్రబాబును 'కామ' సీఎం అన్నామని, 'కామ' సీఎం అంటే కాల్ మనీ సీఎం అని అర్థమన్నారు. సెక్స్ రాకెట్ సీఎం కూడా అన్నామన్నారు. ఆయన హయాంలో జరుగుతోంది కాబట్టి అలా అన్నామన్నారు.

అలాంటప్పుడు తప్పేమిటన్నారు. కానీ కేవలం రోజాను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. మేమంతా కూడా చంద్రబాబును తిట్టామన్నారు. కాల్ మనీ రాకెట్లో చంద్రబాబు స్వయంగా ముద్దాయి అన్నారు. కాల్ మనీ పైన చంద్రబాబు ప్రకటన పూర్తి కాగానే రోజాను సస్పెండ్ చేశారన్నారు.

ఆధారాలు చూపించాం..

తాము కాల్ మనీ విషయంలో చంద్రబాబు పైన ఆధారాలు చూపించామన్నారు. చంద్రబాబు ఓ కాల్ మనీ నిందితుడితో ఫోటో దిగారని, అది ఆధారం కాదా అని ప్రశ్నించారు. (ప్రతిగా టిడిపి సభ్యులు జగన్‌తో ఓ నిందితుడు ఉన్న ఫోటోను చూపించారు).

కాల్ మనీ నిర్వాహకుడితో టిడిపి ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లాడని, ఓ ఎమ్మెల్సీ అన్నయ్య కూడా ఈ రాకెట్లో ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ అన్నయ్య పైన కఠినమైన కేసులు పెట్టలేదన్నారు. కాల్ మనీని ప్రభుత్వం సాధారణ వడ్డీ వ్యాపారంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు.

తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు చంద్రబాబు అసెంబ్లీలో అంబేడ్కర్ పైన చర్చ అంటూ తెరలేపారన్నారు. కాల్ మనీ ఎంతో పెద్ద విషయమని, అలాంటి దాని పైన చర్చను తూతూమంత్రంగా ముగించారని అభిప్రాయపడ్డారు.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడమే కాకుండా, దానిని వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ తాము సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. తాము వాకౌట్ చేశాక... సభ ఎలా జరిగిందో చూసేందుకు నేను కూడా ఉత్సాహపడ్డానని చెప్పాడు.

తాను వాకౌట్ చేశాక సభను చూశానని, అప్పటికప్పుడు ఐదు బిల్లులు ఆమోదించారన్నారు. బెజవాడలో సెక్స్ రాకెట్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అదీ విపక్షాల పైనే దాడులు అన్నారు. సభను అధికార పక్షం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం బిల్లులను ఇష్టం వచ్చినట్లుగా ఆమోదించిందన్నారు. బిల్లులన్నింటిని అప్పటికప్పుడు పెట్టడం, ఆమోదించడం బాధాకరమన్నారు. సింగపూర్ కంపెనీల కోసం చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారని మండిపడ్డారు. ప్రయివేటు వర్సిటీల బిల్లు కూడా పాస్ చేశారన్నారు.

మళ్లీ రోజా గుర్తుకు వచ్చింది.. టైం పాస్

ఆ తర్వాత సభలో వారికి రోజా గుర్తుకు వచ్చిందన్నారు. అందుకే రోజా పైన చర్చ చేపట్టారన్నారు. తన పైన విమర్శలు చేశారన్నారు. సభను ఏదో టైమ్ పాస్ కోసం అన్నట్లుగా ఉందన్నారు. రోజాను సస్పెండ్ చేసిన మూడ్రోజుల తర్వాత రోజా పైన చర్చ అంటే టైమ్ పాస్ కోసమే సభ అన్నారు.

సభలో మేం ఎవరం లేమని, కాబట్టి రోజా పైన చర్చ తర్వాత చంద్రబాబు సభలో ఇష్టం వచ్చినట్లు అబద్దాలు ఆడారన్నారు. చంద్రబాబు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాల పైన చంద్రబాబు ఎన్నో అబద్దాలు చెప్పాడన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+