సీఎం చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న.. ఇంత జరిగినా...!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డీఎస్సీ - 2025 లో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. వరుసగా మీడియా సమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా పేరు తో అక్రమాలకు పాల్పడ్డారని జగన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. అటు అధికారులు.. టీడీపీ నేత లు వివరణ ఇస్తున్నా... జగన్ తన ప్రశ్నలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా.. సీఎం చంద్రబాబు లక్ష్యంగా కీలక ప్రశ్నలు సంధించారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం పైన మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి అంశాలను ప్రస్తావిస్తూ... కీలక ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి లోకేష్ లక్ష్యంగా జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాగా, అటు విద్యాశాఖ- శాప్ అధికారులు వివరణ ఇస్తున్నారు. టీడీపీ నేతలు ఈ ఆరోపణల పైన ఇప్పటి కే సమాధానం ఇచ్చారు. అయితే.. జగన్ ఉద్యోగం పొందిన వారి సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్ష పాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారని జగన్ ప్రశ్నించారు.

జగన్ ట్వీట్.. ప్రశ్నలు
𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh
డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారని నిలదీస్తున్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా అంటూ ధ్వజమెత్తారు. జగన్ తాజాగా మరో ట్వీట్ చేసారు. అందులో వెరిఫికేషన్ పేరుతో అసలు ఏం సాధించారని ప్రశ్నించారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయట పడుతుందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్ధుల భవిష్యత్ తో చంద్రబాబు ప్రభుత్వం ఆటలు ఆడుడుతందని జగన్ మండిపడ్డారు. వెరిఫికేషన్.." నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!" అంటూ జగన్ ట్వీట్ చేసారు. విజేతల జాబితాను పరిశీలిస్తే అభ్యర్ధుల పేర్లు కనిపించటం లేదని చెప్పారు. ఖో ఖో అధికారులను సంప్రదిస్తే సర్టిఫికెట్లు నకిలీ అని తేలిందని ఆరోపించారు. అంతే కాకుండా.. నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ పక్రియ న్యాయపరంగా.. పారదర్శకంగా జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications
