మీదే తెలుగు కాంగ్రెస్, శిల్పాను ఎందుకు చేర్చుకున్నారు: జగన్
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గృహ నిర్మాణ అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. అనంతరం గృహ నిర్మాణ అంశంపై జగన్ మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కొత్త ఇల్లు అయినా నిర్మించిందా అని ప్రశ్నించారు. తమది పిల్ల కాంగ్రెస్ కాదని మీదే తెలుగు కాంగ్రెస్ అని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

మంత్రి అచ్చెన్నాయుడు దీని పైన ఘాటుగా స్పందించారు. గతంలో జరిగిన అక్రమాల వల్లనే కొత్త ఇళ్లకు అనుమతివ్వలేదని చెప్పారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి తాము మద్దతివ్వలేదని, టీడీపీయే మద్దతిచ్చిందని ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి కనిపిస్తే నాడు మంత్రిగా పని చేసిన శిల్బా మోహన్ రెడ్డిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని అధికార టీడీపీని నిలదీశారు.
తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పడం సరికాదన్నారు. తాము దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వారసులం అన్నారు. అనంతరం సభ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications