లడ్డూపై దొరికిపోయిన చంద్రబాబు-వీడియోలు బయటపెట్టిన జగన్-తిరుమలకెళ్లకుండా అడ్డంకులా..!

దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే తొలిసారి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. తిరుమల టూర్ రద్దు చేసుకున్న తర్వాత ఆయన ఇవాళ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన తిరుమల టూర్ ను అడ్డుకునేందుకు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని, ఇతర రాష్ట్రాల నుంచి సైతం బీజేపీ నేతల్ని పిలిపించారని జగన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో తాము చెప్పినవన్నీ అబద్ధాలే అని ఒక్కొక్కటీ రుజువవుతున్నాయన్నారు. అందుకే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

ys jagan reveals reasons for cancellation of Tirumala tour slams government for notices

టీటీడీ బోర్డులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారని, లడ్డూ తయారీ కోసం తక్కువగా కోట్ చేసిన వారికే టెండర్లు ఇస్తారని, ఇందులో ఎక్కడా తప్పు జరిగే అవకాశం ఉండదని జగన్ తెలిపారు. నెయ్యి కొనుగోలు ఆరు నెలలకోసారి రొటీన్ గా జరిగే కార్యక్రమమని, దీనిపై ఏ నిర్ణయమైనా టీటీడీ బోర్డు సభ్యులంతా కలిసే తీసుకుంటారన్నారు. అయినా ప్రసాదం కల్తీ అయిందని, దాన్ని భక్తులు తిన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రే దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను 15 సార్లు వెనక్కి పంపారని జగన్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామన్నారు.

జూలై 23న టీటీడీ ఈవో వెజిటబుల్ ఫ్యాట్స్ నెయ్యిలో కలిశాయని, వాటిని వాడలేదని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. రెండు నెలల తర్వాత చంద్రబాబు జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి స్ధాయిలో అబద్దాలు చెప్పారని మరో వీడియో ప్రదర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత రోజు ఎన్డీడీబీ ఇచ్చిన రహస్య రిపోర్టు టీడీపీ ఆఫీసులో రిలీజ్ చేశారని జగన్ తెలిపారు. ఆ తర్వాత రోజు టీటీడీ ఈవో మళ్లీ తెరపైకి వచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని తాము వాడలేదని, వాటిని వెనక్కి పంపామని వెల్లడించారన్నారు. ఆ తర్వాత ఈవో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ ఇదే విషయం చెప్పారని జగన్ తెలిపారు.

ఇదంతా జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడారని చెప్పిన వీడియోను కూడా జగన్ ప్రదర్శించారు. అన్నీ తెలిసి చంద్రబాబు అబద్ధాలు ఆడారని, లడ్డూపై తప్పుడు ప్రచారం చేసారని జగన్ గుర్తుచేశారు. ఎన్డీడీబీ రిపోర్టులో సైతం నిపుణులు కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షల ఫలితాల్లో తప్పులు దొర్లే అవకాశం కూడా ఉందని డిస్ క్లెయిమర్ కూడా ఇచ్చారని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి ప్రసాదం పుచ్చుకునే భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారని విమర్శించారు. తన రాజకీయ స్వార్ధం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారన్నారు.

జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. ఇలాంటివే రోజుకో అబద్ధం ప్రచారం చేస్తున్నారన్నారు. నందినీ బ్రాండ్ పైనా మరో అబద్ధం ప్రచారం చేశారన్నారు. 2015-19 మధ్య నందినీ బ్రాండ్ ఎందుకు వాడలేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. నందినీ కూడా అప్పుడప్పుడూ టెండర్లలో పాల్గొంటారని, మధ్యలో దూరంగా ఉండిపోయారన్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే జరిగిందన్నారు. రూ.320కే నెయ్యి ఎలా వస్తుందని అడుగుతున్నారని, గత చంద్రబాబు హయాంలో రూ.276 నుంచి రూ.324 కే కొన్నారని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+