పోలవరం ముంపు అందుకే-సీఎంకు అధికారుల వివరణ-జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో పోలవరం సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష జరిపారు. జలవనరులశాఖలో ప్రాజెక్టులపై జరిపిన సమీక్షలో ఆయా ప్రాజెక్టుల తాజా పరిస్దితిని అధికారుల సీఎం దృష్టికి తెచ్చారు.దీంతో స్పందించిన జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు వరద
పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సీఎం జగన్ ఇవాళ సమగ్రంగా సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్-1, గ్యాప్-2లు పూడ్చే పనుల అంశంపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2లు రెండింటినీ పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని వారు వెల్లడించారు.
పోలవరంలో వరద నీటికి కారణాలు
చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందని అధికారులు ఇవాళ సీఎం జగన్ కు తెలిపారు. వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. మరోవైపు షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాఫర్‌డ్యాం పనులకు కూడా ముందస్తు వరదల కారణంగా అంతరాయం ఏర్పడిందన్నారు.
గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదని వారు సీఎంకు వివరించారు. వరదలు పూర్తిగా తగ్గితే... ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

పోలవరంపై జగన్ ఆదేశాలు
పోలవరంలో వరదలు తగ్గగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందని సీఎం తెలిపారు.
పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంపొనెంట్ వైజ్‌గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్‌గా డబ్బులు తెప్పించుకుంటే..ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చన్నారు.
వరద తగ్గగానే ఈ పనులు శరవేగంతో చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్నారు. ఈమేరకు అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. ఈమేరకు కేంద్రానికి లేఖలు కూడా రాయాలని ఆదేశించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు తెలిపారు.

ప్రాధాన్యతా ప్రాజెక్టులపై జగన్
ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామని అధికారులు ఇవాళ సీఎం జగన్ కు తెలిపారు. బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, అది కూడా త్వరలో చేరుకుంటుందని తెలిపారు. దసరా నాటికి అవుకు టన్నెల్-2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ - 2పనులపైనా సీఎం సమీక్ష జరిపారు. ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామని అధికారులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
నెలవారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వంశధార ప్రాజెక్టు స్టేజ్-2,ఫేజ్-2పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని అధికారులు తెలిపారు. అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలంకు నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం రాష్ట్రంలో27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి సీఎం లక్ష్యాలను నిర్దేశించారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications