బెంగళూరుకు వలసవెళుతున్నారు: రైతులకు జగన్ భరోసా(పిక్చర్స్)

అనంతపురం: జిల్లా రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారని.. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయినా ఏపి సిఎం చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారని మండిపడ్డారు.

అప్పుల బాధ తాళలేక రైతన్న ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రూ.5 లక్షల పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందేవరకూ పోరాడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ ప్రభుత్వం వచ్చాక ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని హామీ జగన్ ఇచ్చారు.

ఐదోరోజు రైతు భరోసాయాత్ర పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల్లో శనివారం కొనసాగింది. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న, మడకశిర మండలంలోని టి.డి. పల్లి గ్రామంలో ఆనందప్ప, హెచ్‌ఆర్ పాళ్యం గ్రామంలో ఓబన్న కుటుంబాలను జగన్ పరామర్శించారు.

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కర్ణాటకలో బోయ వర్గంవారు ఎస్టీలుగా ఉన్నారని, కానీ ఏపీలో మాత్రం బీసీలుగా ఉండిపోయారన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగే తొలి అసెంబ్లీ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవంటూ ఆయన ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తానన్నారు. రైతులు, మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

అనంతపురం జిల్లా రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారని.. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

అయినా ఏపి సిఎం చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారని మండిపడ్డారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

అప్పుల బాధ తాళలేక రైతన్న ఆత్మహత్య చేసుకుంటే.. పోస్టుమార్టం రిపోర్టు ఆత్మహత్యేనని చెబుతుంటే.. ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రూ.5 లక్షల పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందేవరకూ పోరాడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తమ ప్రభుత్వం వచ్చాక ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని హామీ జగన్ ఇచ్చారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

ఐదోరోజు రైతు భరోసాయాత్ర పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల్లో శనివారం కొనసాగింది.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

జగన్ భరోసా యాత్ర

జగన్ భరోసా యాత్ర

పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న, మడకశిర మండలంలోని టి.డి. పల్లి గ్రామంలో ఆనందప్ప, హెచ్‌ఆర్ పాళ్యం గ్రామంలో ఓబన్న కుటుంబాలను జగన్ పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+