అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ‘రాష్ట్రంలో రైతు, చేనేతల పరిస్థితి దారుణంగా ఉంది. కష్టాలున్నాయని ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు అండగా ఉంటా, మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ అందరికీ న్యాయం చేస్తా.' అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో బుధవారం జగన్‌ రైతు, చేనేత భరోసా యాత్ర చేపట్టారు. మధ్యాహ్నం ధర్మవరం చేరుకున్న జగన్‌.. వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన చట్టా రమేశ్‌, రమాదేవి కుటుంబాన్ని, కప్పల నారాయణస్వామి భార్య ముత్యాలమ్మను, లోనికోటకు చెందిన గవ్వల కుళ్లాయప్ప భార్య తిప్పమ్మను పరామర్శించారు.

ఆయా కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కన్నీటి గాథలను విని ఆయన కదిలిపోయారు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలను చూసి ఆయన కన్నీరు పెట్టారు. ఆ పిల్లల చదువుల బాధ్యతలను తాము తీసుకుంటామని బంధువులకు జగన్ హామీ ఇచ్చారు.

 అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ జగన్ చేపట్టిన నాల్గో విడత భరోసా యాత్ర బుధవారం ప్రారంభమైంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 11 గంటలకు కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు.

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అక్కడ జగన్‌కు అనంతపురం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ధర్మవరం చేరుకున్నారు. ధర్మవరం పట్టణ శివార్లలోని వైఎస్సార్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతులు చట్టా రమేష్, చట్టా రమాదేవి కుటుంబాన్ని, చేనేత కార్మికుడు కప్పల నారాయణస్వామి కుటుంబాన్ని పరామర్శించారు.

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

ప్రభుత్వం నుంచి తమకేమీ పరిహారం కానీ, చేయూత కానీ లభించలేదని వారు తెలిపారు. వారి పిల్లలతో, బంధువులతో మాట్లాడి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యత చూస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.
 అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

ఎన్నికల ముందు చేనేత రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేయడం వల్ల కార్మికులంతా బ్యాంకుల దృష్టిలో ఎగవేతదారులు(డిఫాల్టర్లు) అయ్యారని, అందువల్ల కొత్త రుణాలేవీ పుట్టలేదనే విషయం జగన్ దృష్టికి వారు తీసుకొచ్చారు.

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అనంతరం పట్టణంలోని లోనికోటలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గవ్వల కుళ్లాయప్ప కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. కుళ్లాయప్ప భార్య తిప్పమ్మ, కుమారులు రాజశేఖర్, మురళీ, ప్రసాద్, కుమార్తెలు ఉమాదేవి, లక్ష్మితో జగన్ మాట్లాడారు.

 అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

అధైర్య పడకండి, అండగా ఉంటా: భరోసా యాత్రలో జగన్

రైతు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కుళ్లాయప్ప కుమార్తె లక్ష్మీ డిగ్రీ చదువుతుండడంతో ఉన్నత చదువులు లేదా ప్రైవేటు ఉద్యోగం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

English summary
YS Jagan rytu bharosa yatra at Dharmavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X