వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో జగన్ లెక్కపై టీడీపీ జోకులు-అలాగైతే 600 రోజుల్లో జంగారెడ్డిగూడెం ఖాళీ అవుతుందా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయంలో తాజాగా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలు ట్విస్ట్ ఇచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది కల్తీ సారా కారణంగా చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం దీన్ని ఖండిస్తూ నెల రోజుల వ్యవధిలో వీరంతా సహజ మరణం చెందారంటూ కొత్త వాదన అందుకుంది. ఇదే క్రమంలో దీన్ని సమర్ధిస్తూ సీఎం జగన్ ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటనలో ఓ విచిత్రం చోటు చేసుకుంది.

సీఎం జగన్ చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా రోజుకు రెండుశాతం సహజమరణాలు చోటు చేసుకుంటుంటాయని తెలిపారు. ఇదే క్రమంలో దాదాపు 50 వేల జనాభా కలిగిన జంగారెడ్డిగూడెంలోనూ 2 శాతం చొప్పున 90 సహజ మరణాల వరకూ చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. కానీ ఇక్కడ 18 మంది చనిపోతే విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అసెంబ్లీలో జగన్ మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యమంత్రి ఆళ్లనాని ప్రకటన చేసిన తర్వాత కూడా విపక్ష టీడీపీ అసెంబ్లీని అడ్డుకోవడంతో చివర్లో జగన్ స్పందించారు. సహజమరణాలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో జగన్ చెప్పిన సహజమరణాల లెక్కపై టీడీపీ సెటైర్లు వేస్తోంది.

ys jagans natural deaths euqation-tdp fears of jangareddygudem will be empty in 600 days

అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ట్విట్టర్ లో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు.
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా సుమారు 54880 మందని సీఎం జగన్ చెప్పారని, అందులో రోజూ సరాసరిన కనీసం 90 మంది సాధారణంగానే చనిపోతారని కూడా చెప్పారని ఆయన వెల్లడించారు. ఇలా సాధారణంగా రోజూ 90 మంది చనిపోతే.... జంగారెడ్డిగూడెంలో జనాభా మొత్తం సుమారు 610 రోజుల్లో చనిపోతారుగా సీఎం జగన్ గారు
అంతేనా...!!! అంటూ ట్విట్టర్ లో అయ్యన్న వ్యంగాస్ట్రాలు సంధించారు.

English summary
tdp on today made satires on cm jagan's natural deaths equation applied to jangareddygudem deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X