వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడ్చారు: బాలకృష్ణ పేరుతో బాబుపై జగన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్రలో భాగంగా ఆదివారం నాడు అనంతపురం జిల్లా లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని పరామర్శించారు.

వారి కుటుంబ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. జగన్ ఇంట్లోకి రాగానే వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వారిని జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ పలుచోట్ల మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు తొమ్మిది నెలలు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

 జగన్

జగన్

గత ఎన్నికల సందర్భంగా టెలివిజన్ ఆన్ చేస్తే చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి చెందిన అన్ని రుణాలు మాఫీ అవుతాయని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు రుణాలు మాఫీ అవుతాయని ఊదగొట్టించారన్నారు.

 జగన్

జగన్

రాష్ట్రంలో రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా చంద్రబాబు కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలను ఇరకాటంలో పడేశారన్నారు. బంగారం తాకట్టు రుణాలు మాత్రం పైసా కూడా మాఫీ కాలేదన్నారు.

 జగన్

జగన్

చంద్రబాబు హామీతో రైతులు తమ బంగారు నగలకు విముక్తి కలుగుతుందని ఎదురు చూస్తుంటే బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయన్నారు.

 జగన్

జగన్

బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే విషయమై అసెంబ్లీలో నిలదీస్తే తానలా హామీ ఇవ్వలేదని బొంకుతున్నారన్నారు.

జగన్

జగన్

స్వయానా చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలోనే రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నా చలించడం లేదన్నారు.

 జగన్

జగన్

రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తానని తెలిసిన చంద్రబాబుకు గుండెల్లో గుబులు పుట్టిందన్నారు.

 జగన్

జగన్

గతంలో అనంతపురం జిల్లాలో ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పిన చంద్రబాబు, తన పర్యటనతో 29మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించడమే ఇందుకు నిదర్శమన్నారు.

 జగన్

జగన్

వైఎస్సార్ హయాంలో జరిగిన హంద్రీనీవా పనులను తన హయాంలో పూరె్తైనట్టుగా చెప్పుకుని చంద్రబాబు శాలువాలు కప్పించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

 జగన్

జగన్

గాలేరు, నగరి పథకానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో కేవలం రూ.11 కోట్లు కేటాయించగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.4500 కోట్లు వెచ్చించారన్నారు.

 జగన్

జగన్

రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌కు అనంతపురం జిల్లా సరిహద్దులో ఆదివారం ఘన స్వాగతం లభించింది.

 జగన్

జగన్

తొలిరోజు యాత్ర కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకూ సాగింది. ఈ సందర్భంగా లేపాక్షి మండలం మామిడిమాకులపల్లిలో అప్పుల బాధ తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్దప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.

 జగన్

జగన్

పంటల సాగుకు చేసిన రుణాలు, వాటిపై పెరిగిన వడ్డీ భారం కావడంతో చివరకు కుటుంబాన్ని కూడా పోషించలేక పోతున్నానన్న వ్యథతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు సిద్దప్ప భార్య రంగమ్మ జగన్ ఎదుట విలపించింది.

 జగన్

జగన్

చలించిన జగన్ వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిహారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

English summary
YS Jagan's Rythu Bharosa Yatra to highlight farmers' suicides in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X