ప్రధాని మోదీ, అమిత్ షా తో భేటీ కానున్న జగన్ - కీలక మలుపు..!?

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ సీఎం జగన్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త మంత్రాంగానికి సమాయత్తం అవుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన నిరసనలకు దిగుతున్న వైసీపీ అధినేత.. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వారిద్దరి అప్పాయింట్ మెంట్ కోరినట్లు పార్టీ నేతల సమాచారం. వచ్చే వారం పార్లమెంట్ ప్రాంగణంలో వారితో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీకి ఇప్పటి వరకు వెళ్లలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన మాత్రం రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పరామర్శలు.. పర్యటనలు కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న కీలక బిల్లు లకు మద్దతు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు.

YS Jagan seek PM Narendra Modi appointment to complaint on state issues as latest reports

ఇదే అంశం తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా.. కేంద్ర పెద్దలతో మాత్రం జగన్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. కాగా, జగన్ తాజాగా ప్రధాని మోదీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరారు. అక్కడ నుంచి సమయం ఇవ్వగానే ఢిల్లీ వెళ్లి కలవాలని నిర్ణయించారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఆ ఇద్దరినీ కలిసే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు.. అవినీతి అంశాల పైన వారిద్దరికీ ఫిర్యాదు చేసే ఆలోచనతోనే జగన్ అప్పాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. అయితే.. జగన్ కు ఈ ఇద్దరి నుంచి అప్పాయింట్ మెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ప్రకటిస్తోంది.. ఇదే సమయంలో జగన్ అప్పాయింట్ మెంట్ కోరారు. దీంతో.. జగన్ కు కలిసేందుకు అవకాశం వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అప్పాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. దీంతో.. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయం పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+