మళ్లీ జనంలోకి జగన్..

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాప్తాడుకు వెళ్లనున్నారు.

నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజకీయ కక్షలే దీనికి కారణం అంటూ విమర్శించారు.

YS Jagan set to visit Satyasai Puttaparthi on April 8

ఈ హత్యోదంతం తరువాత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో ఫోన్‌లో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన పూర్తి వివరాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి ఆరా తీశారు.

ఉగాది పండగ నాడు లింగమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి వస్తోండగా, దారి కాచిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని ఈ సందర్భంగా కురుబ శ్రీనివాసులు, మురళ.. వైఎస్ జగన్‌కు వివరించారు. అప్పటి నుంచి తామంతా భయాందోళనల్లో గడుపుతున్నామని అన్నారు.

దీనిపై జగన్ మాట్లాడుతూ- పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని అన్నారు. అన్ని విధాల ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైఎస్‌ జగన్‌ ఆ కుటుంబానికి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన రాప్తాడుకు వెళ్లనున్నారు. లింగ‌మ‌య్య‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఆయన పర్యటన వివరాలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన జగన్ రాప్తాడుకు రానున్నారని, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. పార్టీలకు అతీతంగా హత్యా రాజకీయాలను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+