సరిపోతుందా చంద్రబాబూ..! మరో ఆధారం ట్వీట్ చేసిన జగన్..!

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తర్వాత వైసీపీ, టీడీపీ అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ముందు లడ్డూ వివాదంతో మొదలైన ఈ మాటల యుద్ధం అనంతరం డిక్లరేషన్ కు చేరింది. ఈ క్రమంలోనే జగన్ తిరుమల టూర్ వేళ డిక్లరేషన్ ఇచ్చి తీరాలన్న ప్రభుత్వ పంతం ఓవైపు, ఇవ్వడం ఇష్టం లేని జగన్ మరోవైపు పరస్పరం మాటల తూటాలు సంధించుకున్నారు. దీంతో చంద్రబాబు మీకు నోటీసులిస్తే చూపించాలని జగన్ ను కోరారు.

దీంతో ఇవాళ తన తిరుమల టూర్ సందర్భంగా వైసీపీ నేతలకు జారీ చేసిన నోటీసుల్ని ఎక్స్ లో వైఎస్ జగన్ షేర్ చేశారు. దీంతో పాటు చంద్రబాబు వీడియోను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతటితో ఆగకుండా దీనర్ధం ఏంటని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ ఆధారం సరిపోతుందా అని చంద్రబాబును అడిగారు.చివర్లో సత్యమేవ జయతే అని మరో ట్యాగ్ ను కూడా దీనికి తగిలించారు. తద్వారా నోటీసులు ఇస్తే చూపించాలని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చినట్లయింది.

ys jagan shares another evidence on his tirumala tour ask Is this not enough chandrababu

ఈ ట్వీట్ లోనే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ ట్వీట్ ను జగన్ కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జీతన్ రామ్ మాంఝీ, లలన్ సింగ్, శర్బానంద్ సోనోవాల్, ప్రహ్లాద్ జోషీ, జ్యూయల్ ఓరం, మన్సుఖ్ మాండవీయ, గిరిరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరీ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇందర్ జీత్ సింగ్, జితేంద్ర సింగ్ లకూ ట్యాగ్ చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+