దేశంలోనే దిక్కుమాలిన సీఎం, మనకు అవసరమా?: జగన్ పిలుపు

Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీం చంద్రబాబునాయుడు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కర్నూలులో పాద‌యాత్రను ముగించుకున్న జ‌గ‌న్... సోమవారం అనంత‌పురంలోని గుత్తి పట్టణంలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. 'మ‌న‌కు ఎలాంటి నాయ‌కుడు కావాలి? మోసం చేసేవారు నాయ‌కుడిగా కావాలా? అస‌త్యాలు చెప్పేనాయ‌కుడు కావాలా?' అని ప్రశ్నించారు. 'నాలుగేళ్ల చంద్ర‌బాబునాయుడి పాలన చూశాం. ఎన్నో అసత్యాలు చెప్పుకుంటున్నారు. గుత్తి మోడ‌ల్ స్కూల్ నుంచి టీచ‌ర్లు వ‌చ్చారు... ఆ స్కూల్లో ప‌రిస్థితి ఏంటో తెలుసా? దాదాపు ఆరు నెల‌ల నుంచి టీచ‌ర్ల‌కు జీతాలు లేవు. వారు చ‌దువు ఎలా చెబుతార‌న్న జ్ఞానం కూడా చంద్ర‌బాబుకి లేదు' అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

బాధలు చెప్పుకున్నారు

బాధలు చెప్పుకున్నారు

‘గుత్తి మున్సిపాలిటీలో ప‌నిచేసే కార్మికులు నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. మూడు నెల‌ల నుంచి జీతాలు ఇవ్వ‌లేద‌ని అన్నారు. ఇదే గుత్తిలో ఉర్దూ స్కూల్ ఉంది.. మీ అంద‌రికీ తెలుసు.. పిల్ల‌ల‌కు అన్నం వండే ఆయాలు వ‌చ్చారు.. ఆరు నెల‌ల నుంచి అన్నం వండుతున్నా త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌ట్లేద‌ని అన్నారు. త‌మ‌కు ఇంత‌వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి డ‌బ్బులు రాలేవని చెబుతున్నారు' అని జగన్ చెప్పారు.

 విచ్చలవిడి అవినీతి

విచ్చలవిడి అవినీతి

‘అప్ప‌ట్లో 108 కుయ్‌, కుయ్‌, కుయ్ అంటూ వ‌చ్చేది. ప్రియ‌త‌మ నాయ‌కుడు వైయస్సార్ ఆ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. త‌మ‌కు రెండు నెల‌ల నుంచి జీతాలు లేవ‌ని 108 వారు చెబుతున్నారు. జెడ్‌పీ హై స్కూల్ లో బాత్రూమ్‌లు లేవ‌ని నాకు పిల్ల‌లు చెప్పారు. మీ క‌ష్టాల‌న్నింటినీ తెలుసుకున్నాను. పాల‌న‌లో విచ్చ‌ల‌విడి అవినీతి క‌న‌ప‌డుతోంది' అని జగన్ మండిపడ్డారు.

 బుద్ధి చెప్పాల్సిందే..

బుద్ధి చెప్పాల్సిందే..

‘గ్రామాల్లో రేష‌న్‌ బియ్యం కావాల‌న్నా లంచం ఇవ్వాల్సిందే. అన్నా.. ఇదన్నా మా ప‌రిస్థితి అని గుత్తి ప్ర‌జ‌లు బాధ‌లు చెప్పారు. ఒక్క‌సారి గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకోండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పండి' అంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.

 ఈ దిక్కుమాలిన సీఎం అవసరమా?

ఈ దిక్కుమాలిన సీఎం అవసరమా?

‘మట్టి నుంచి ఇసుక, మద్యం, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదలకుండా అవినీతి కనపడుతోంది. దొంగల రాజ్యం కనిపిపస్తోంది. బాబు పైన తింటున్నారు. గ్రామా గ్రామన జన్మభూమి కమిటీలు ప్రజలను తింటున్నాయి. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వక తప్పడం లేదు. బోయలను, బుడగలను ఎస్టీలను మోసం బాబు చేశారు. కాపులను కూడా చీట్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఒకమాట. ఎన్నికల తర్వాత మరోమాట. దేశంలో నీ అంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఉంటాడా?. మనకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా?' అంటూ ప్రజలను ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలను రూ. 50 నుంచి రూ.500 వరకు పెంచారని ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP president YS Jagan Mohan Reddy on Monday slammed Andhra Pradesh CM Chandrababu Naidu at Gutti in Anantapur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి