చంద్రబాబుకు జగన్ అద్భుతమైన సలహా..! సుదీర్ఘ ట్వీట్ ...
ఏపీలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ ఇవాళ ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ప్రజారోగ్యానికి కూటమి సర్కార్ ఉరితాడు బిగిస్తోందని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రజారోగ్యం విషయంలో తీసుకున్న చర్యల్ని ఆయన గుర్తుచేసారు. ఇప్పుడు కూటమి సర్కార్ వాటిని విస్మరిస్తోందన్నారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది చంద్రబాబు గారూ అంంటూ జగన్ ట్వీట్ ప్రారంభించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని, ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని విమర్శించారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారన్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారన్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యమన్నారు. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు.
వైసీపీ హ

తమ ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయన్నారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. అలా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉందని, అన్ని వసతులూ ఉన్నా, చంద్రబాబూ... మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టిందని జగన్ విమర్శించారు.
. @ncbn గారూ… రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2024
కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? అని ప్రశ్నించారు. ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయన్నారు. దీంతోపాటు కొత్తకాలేజీల్లో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారన్నారు.
మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రయివేటు కోసం, ప్రయివేటు కొరకు, ప్రయివేటు చేత, ప్రయివేటు వల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారని ఆరోపించారు.
ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలని కోరారు. ప్రయివేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయని, వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తాము మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసేదిశగా అడుగులు వేయాలని కోరారు. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరారు.












Click it and Unblock the Notifications