YS Jagan: అంబటి రియాక్షన్ అందుకే ? తేల్చేసిన జగన్..! సీబీఐ క్లీన్ చిట్..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, జంగిల్ రాజ్ నడుస్తోందని గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (ys jagan)ఆరోపించారు. మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై జరిగిన దాడుల్ని చూస్తే జంగిల్ రాజ్ కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
తిరుపతి లడ్డూలో పంది మాంసం కొవ్వు ఉందని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేసిందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని మన వెంకటేశ్వర స్వామి పేరుని చెడగొట్టే ప్రయత్నం చేశారని జగన్ విమర్శించారు. టీటీడీ నెయ్యి కల్తీపై ఎన్ డి ఆర్ ఐ ల్యాబ్స్ పరిశీలనలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని నిర్ధారించారన్నారు. తప్పు చేసి ఉంటే సీబీఐ ఛార్జ్ షీట్లో కరుణాకర్ రెడ్డి పేరు, వైవీ సుబ్బారెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్స్ ఈ విషయం క్లీన్ చిట్ ఇచ్చాయని గుర్తుచేశారు.

వైవీ సుబ్బారెడ్డి ఈ కేసుపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సీబీఐ విచారణకు ఆదేశించిందని, వాళ్లు విచారణ చేపట్టి ఎవరూ తప్పు చేయలేదని నిర్ధారించారని జగన్ గుర్తుచేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు చేసిన తప్పులకి ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. తప్పుడు సమాచారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు సమాచారంతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ఎవరికైనా ఉందా అని జగన్ అడిగారు. ఇదే సమాచారంతో మేము ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా అన్నారు. అబద్దాలు చెబుతూ మోసం చేస్తూ ప్రజలను వక్రీకరిస్తున్నారన్నారు.

చంద్రబాబుని గట్టిగా ప్రశ్నిస్తే అంబటి రాంబాబుపై దాడి చేశారని, ఆయనకు జ్ఞానం రావాలని గుడిలో పూజ చేసి వస్తున్న సమయంలో ఏకంగా కర్రలు పట్టుకొని దాడులు చేశారని జగన్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేసిన పరిస్థితి ఉందన్నారు. బూతులు తిడుతూ అంబటి రాంబాబు కారుపై దాడులు చేస్తే, ఒక్కరిపై అంత మంది వస్తే వాళ్లు తిట్టిన బూతులకు అంబటి స్పందించారన్నారు. రియాక్ట్ అయ్యే సమయంలో ఒక్కడే ఉండటంతో సహనం కోల్పోయారన్నారు. అంబటి రాంబాబు రియాక్షన్ లో భాగంగా రెండు మూడు బూతులు తిట్టారని తెలిపారు. సంస్కారం ఉన్న వ్యక్తిగా అంబటి రాంబాబు తాను తిట్టకుండా ఉండాల్సిందని వివరణ కూడా ఇచ్చారని జగన్ గుర్తుచేశారు. ఆయన చూపించిన సంస్కారానికి నిజంగా పొగడాలన్నారు. చేతనమైతే పొగడాల్సిన వాళ్లు దానిని వక్రీకరిస్తూ ఇంటిపై దాడి చేశారని విమర్శించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications