మోసం, వెన్నుపోటు నేర్పలా: జగన్, రాష్ట్రాన్ని దోచుకోలేదన్న అచ్చెన్నాయుడు

హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లేని గొప్పలు చెప్పుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏపి శాసనసభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. దేశం కన్నా ఒకశాతం వృద్ధిరేటు ఎక్కువగా ఉందని చెప్పుకున్నారని అన్నారు. నిరుడి కంటే ఈ ఏడాది గ్రాంట్లు ఎక్కువగా ఉన్నాయని, కేంద్ర నిధులు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నందునుకున్నామని చెప్పారు.

YS Jagan speech on AP budget

బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం 11వేల కోట్లు తగ్గించారని అన్నారు. ప్రణాళికేతర వ్యయం తగ్గించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. బడ్జెట్‌లో రూ. 22వేల కోట్లు ఎక్కువగా చూపించారని ఆరోపించారు. రూ. 90వేల కోట్ల బడ్జెట్‌ను లక్షా 12వేల కోట్లుగా చూపించారని అన్నారు. ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెంచిన ఉద్యోగుల జీతాలు సరిగా చూపించలేదని అన్నారు. బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు చూపించారని మండిపడ్డారు.

ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ లెక్కలు చూసి మన రాష్ట్రం గురించి వారు ఏమనుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ, వెన్నుపోటు పొడిచేలా కాదని అన్నారు. ఎత్తుగా, బలంగా ఉంటే సరిపోదు బుర్ర ఉండాలి అని మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి జగన్ అన్నారు. పరిజ్ఞానం కూడా పెంచుకోవాలని అన్నారు. ప్రజలకు మోసం చేయడం, వెన్నుపోటు పొడవటం నేర్పాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టాలా? అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో కూడా రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారనీ.. ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. రుణమాఫీపై ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు సంతకంతో కూడిన పాంప్లెట్లు ఇంటింటికి పంపిణీ చేశారని, వాటిని చూపించారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పత్రికల్లో రుణాలు మాఫీ చేస్తామని ప్రకటనలు ఇచ్చారని వాటిని చూపించారు. ఎర్రచందనం అమ్మి వెయ్యి
కోట్లు సంపాదించారని అన్నారు.

మంత్రి ఉమామమహేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల జీతాల పెంపుపై జగన్ అభిప్రాయం తెలపాలని, ఉద్యోగులకు జీతాలు పెంచడం అతనికి ఇష్టం లేనట్లుగా ఉందని అన్నారు. దీనికి స్పందిస్తూ ఉమాకు బడ్జెట్‌పై అవగాహన లేదని, వారు కూడా మాట్లాడుతున్నారని జగన్ అన్నారు.

ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి తనవైపు చూస్తూ మాట్లాడుతున్నారని.. స్పీకర్ వైపు చూసి మాట్లాడితే బాగుంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. కేంద్రం సాయం అక్కర్లేదనే విధంగా రాష్ట్రం ఉందనే దోరణిలో జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. వెన్నుపోటు పొడిచే వైఖరి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఎవరైనా తండ్రి చనిపోతే బాధపడతారని కానీ, వైయస్ చనిపోయినప్పుడు జగన్ మాత్రం సిఎం అయ్యేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడొద్దని జగన్‌కు సూచించారు. వైయస్ సిఎం కావడంతో జగన్ లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్‌లా తాను
రాష్ట్రాన్ని దోచుకోలేదని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అవగాహన లేకుండా మాట్లాడడని అన్నారు.

జగన్.. ఓపిక ఉండాలి: స్పీకర్

జగన్ మీకు ఓపిక అవసరం.. మీతోపాటు సభ్యులకూ కూడా అవసరమేనని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. అధికార పక్ష తనేలకు ఇచ్చినట్లుగానే మీకు కూడా సమయం ఇస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+