ఇదేనా భవిష్యత్తుకు గ్యారంటీ ?- యూరియా కొరతపై జగన్ ట్వీట్..!
ఏపీలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సుదీర్ఘ ట్వీట్ పెట్టారు. ఇందులో చంద్రబాబు గారూ... మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని ఆక్షేపించారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? అని అడిగారు.
మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని జగన్ ప్రశ్నించారు. మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదన్నారు. ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్నదానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ఐదేళ్ల తన పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా అని అడిగారు. ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడంలేదనే కదా అర్థమన్నారు. ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేసి, బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారన్నారు.
.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025
అక్రమ నిల్వలపై తనిఖీల్లేవు, ఎవ్వరిమీదా చర్యల్లేవు. పీఏసీలకు, ఆర్బకేలు సరైన కేటాయింపులు లేవన్నారు. దీనికి కారకులు మీరేకదా చంద్రబాబూ అన్నారు. తమ హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లైచేశామని గుర్తుచేశారు. పీఏసీలద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50ల తక్కువ రేటుకు రైతుకు అందించగలిగామన్నారు. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్‌ల నుంచి మీ కొచ్చే కమీషన్లకోసమే అన్నారు.












Click it and Unblock the Notifications