దొంగే దొంగ అన్నట్లుంది..చంద్రబాబుకు ఐదు ప్రశ్నలతో జగన్ ట్వీట్..!
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మరోసారి ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధిస్తూ జగన్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చర్యలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని జగన్ ప్రశ్నించారు. అసలు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నది ఎవరని నిలదీశారు.
నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబు రు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్ చేశారని, చంద్రబాబుకు కొరుకుడుపడనిది సోషల్ మీడియా అన్నారు. అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారన్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నామన్నారు.
ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు సిద్ధాంతం అన్నారు. దీనికోసం చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, దానికి రెక్కలు తొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారని, దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారని తెలిపారు.
1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2024
అయ్యా చంద్రబాబూ, మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్‌మీడియా అకౌంట్లో మీరే ఫేక్ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారన్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్‌గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్‌లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావన్నారు.












Click it and Unblock the Notifications