సొంతూరికి వైఎస్ జగన్-రేపటి నుంచి మూడ్రోజులపాటు-బిజీ బిజీ షెడ్యూల్ ఇదే..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్రిస్మల్ పండుగ సందర్భంగా సొంతూరికి వెళ్లనున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జగన్ పర్యటన సాగబోతోంది. ఈ మూడు రోజుల్లో కడప అమీన్ పీర్ దర్గాను సైతం జగన్ సందర్శిస్తారు.
రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఉంటుంది. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో జగన్ పర్యటించబోతున్నారు. కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం వంటివి జగన్ టూర్ షెడ్యూల్లో ఉన్నాయి.

23వ తేదీ ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం 11.50 - 12.20 మధ్య కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. తర్వాత 12.35 - 12.45 పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసానికి వెళ్లనున్నారు.
అనంతరం 1.15 - 1.25 మధ్య మాధవి కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు జగన్ హాజరవుతారు. ఆ తర్వాత 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 - 3.45 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసి, బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4.50కి ఇడుపులపాయ చేరుకుని వైయస్సార్ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి జగన్ బస చేస్తారు.

24వ తేదీన సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వైయస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైయస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఉదయం 9.10 - 9.40 మధ్య వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. తర్వాత 10.00 - 12.00 ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 12.40 పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. అనంతరం 1.10 - 1.20 మధ్య విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత 1.30 - 1.40 మధ్య కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. తర్వాత 1.50 - 2.00 మధ్య కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు.
2.05 - 2.20 మధ్య మైత్రి లే అవుట్‌ను జగన్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.35 - 2.50 మధ్య రాయలాపురం వంతెన ప్రారంభించి, 3.00 - 3.30 మధ్య డాక్టర్ వైయస్సార్ బస్‌స్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 3.35 - 3.55 అహోబిలపురం స్కూలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. 4.05 - 4.20 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 4.30 - 4.45 జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
25వ తేదీ క్రిస్మస్ రోజు.. ఉదయం 8.40 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 - 10.15 మధ్య సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. దీంతో జగన్ మూడు రోజుల టూర్ ముగియనుంది.












Click it and Unblock the Notifications