తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి ప్రచారానికి జగన్‌-ఏప్రిల్ 14న ఒక్కరోజు- సీఎంగా తొలిసారి-కారణమిదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజాగా ముగిసిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న సీఎం జగన్‌.. తిరుపతి ప్రచార బరిలోకి దిగబోతున్నారు. ఏప్రిల్‌ 14న తిరుపతిలో ఆయన ఒక్క రోజు ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయకపోయినా సునామీ సృష్టించిన వైసీపీ.. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక కోసం ఆయన్ను ఎందుకు బరిలోకి దింపుతుందనే అంశంపై పలు చర్చలు సాగుతున్నాయి. అయితే సీఎం అయ్యాక జగన్ ప్రచారం చేయనుండటం ఇదే తొలిసారి.

తిరుపతి ప్రచారానికి జగన్

తిరుపతి ప్రచారానికి జగన్


తిరుపతి పార్లమెంటు స్ధానానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందులో వైసీపీ అభ్యర్ధిగా రాజకీయాలకు కొత్త అయిన జగన్ ఫిజియోధెరపిస్టు డాక్టర్ గురుమూర్తి బరిలోకి దిగారు. ఆయన కేవలం వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇమేజ్ ఆధారంగానే ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేకుండానే బరిలోకి దిగిన గురుమూర్తికి రికార్డు స్ధాయి మెజారిటీ అందించాలని పార్టీ నేతలకు ఇప్పటికే టార్గెట్‌ పెట్టిన జగన్‌.. ఇప్పుడు ఆయన కోసం నేరుగా ప్రచార బరిలోకి దిగబోతున్నారు. దీంతో జగన్‌ ప్రచారం ఈ ఉపఎన్నికలలో ప్రధాన ఆకర్షణగా మారబోతోంది.

 ఏప్రిల్‌ 14న తిరుపతిలో జగన్ ప్రచారం

ఏప్రిల్‌ 14న తిరుపతిలో జగన్ ప్రచారం

ఏప్రిల్‌ 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక ప్రచార పర్వం ఈ నెల 15తో ముగియబోతోంది. ఆ ముందు రోజు అంటే ఏప్రిల్‌ 14న తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి తరఫున ప్రచారానికి జగన్‌ వెళ్లబోతున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్ధి తరఫున జగన్ సుడిగాలి ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రచార షెడ్యూల్‌ ఇంకా విడుదల చేయకపోయినా ఏప్రిల్‌ 14న మాత్రం ఏడు సెగ్మెంట్లలో జగన్ ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.

 సీఎం అయ్యాక తొలిసారి ప్రచారానికి

సీఎం అయ్యాక తొలిసారి ప్రచారానికి


రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ చివరి సారిగా కనిపించారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలకే జగన్ పరిమితమయ్యారు. సీఎం కాకముందు ప్రజల్లో విస్తృతంగా తిరిగిన జగన్.. 3 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ సీఎం అయ్యాక మాత్రం వైసీపీ ఘనవిజయం నేపథ్యంలో పాలనపై దృష్టిపెట్టాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు కూడా లేకపోవడంతో సీఎం జగన్ వైసీపీ నేతలతోనే ప్రచారం చేయించారు. తాను ఎక్కడా బరిలోకి దిగాల్సిన అవసరం లేకుండానే పార్టీకి ఘనవిజయాలు లభించేలా చేయగలిగారు.

ఇంటిలిజెన్స్‌ నివేదికలే కారణమా ?

ఇంటిలిజెన్స్‌ నివేదికలే కారణమా ?

తిరుపతి పార్లమెంటు స్ధానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరికి తోడుగా నియోజకవర్గానికో ఎమ్మెల్యేను అదనంగా ప్రచారానికి పంపారు. వీరితో పాటు ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో మంత్రికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. వీరిపై సమన్వయానికి బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, కీలకమంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. అయినా వైసీపీకి ఆశించిన రీతిలో ప్రజాదరణ దక్కడం లేదని తెలుస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి బయటపడతాడనే ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలతో పాటు ఇంటిలిజెన్స్‌ నివేదికలు కూడా వచ్చినట్లు సమాచారం. దీంతో గురుమూర్తిని గట్టెక్కించేందుకే జగన్ బరిలోకి దిగాల్సి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

 హిందూ వ్యతిరేకి ప్రచారానికి కౌంటర్

హిందూ వ్యతిరేకి ప్రచారానికి కౌంటర్


తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోకి వైసీపీ అధినేతగా, సీఎంగా ఉన్న జగన్ రాకపోతే బీజేపీ-జనసేన నుంచి హిందూత్వ వ్యతిరేక విమర్శలు ఎదురవుతాయని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్టియన్ కావడం వల్లే తిరుపతి ప్రచారానికి జగన్ రావడం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసే ప్రమాదం ఉండటం వల్లే జగన్ ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తిరుపతి ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. వారంతా జగన్‌ను హిందూవ్యతిరేకిగా విమర్శించడం మొదలుపెట్టాక అప్పుడు బరిలోకి దిగితే వారి విమర్శలకు భయపడ్డారనే ప్రచారం తప్పదు.

 తిరుపతి ప్రజలకు త్వరలో జగన్ లేఖ

తిరుపతి ప్రజలకు త్వరలో జగన్ లేఖ

తిరుపతి ఉపఎన్నికలో భాగంగా టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వ అజెండా అయిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. దీంతో పాటు తానే స్వయంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాయాలని నిర్ణయించారు. ఇందులో రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు జరిగిన లబ్దిని జగన్ పూర్తి స్ధాయిలో వివరించబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా తిరుపతిలో గురుమూర్తిని గెలిపించడం ద్వారా సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఓటర్లను జగన్ కోరబోతున్నారు.

English summary
andhra pradesh, tirupati, tirupati byelection, ys jagan, campaign, cm jagan, ysrcp, gurumurthy, majority, intelligence report, ap govt, ap news
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X