రేపు పులివెందులకు జగన్ -అసెంబ్లీకి వస్తారా..?

ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పరాజయం నేపథ్యంలో విపక్ష నేత హోదా కూడా కోల్పోయిన జగన్.. ఇవాళ ఎమ్మెల్యేగా మాత్రం ప్రమాణస్వీకారం చేశారు. ముభావంగానే అసెంబ్లీకి వచ్చిన జగన్.. ప్రమాణస్వీకారం చకచకా పూర్తి చేసుకుని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అనంతరం లాబీల్లో వైసీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్.. వారికి దిశానిర్దేశం చేసి ఇంటికి వెళ్లిపోయారు. రేపు తన సొంత జిల్లాలో పర్యటనకు జగన్ సిద్దమయ్యారు.

రేపు ఉదయం పులివెందుల వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసెంబ్లీలో కొత్త స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రేపు అధికారికంగా బాధ్యతలు చేపడతారు. అనంతరం అయన్ను అన్ని పార్టీల నేతలు అభినందించబోతున్నారు. ఈ తరుణంలో జగన్ అసెంబ్లీకి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఇవాళ ప్రమాణస్వీకారం చేయని వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్ బాధ్యతలు చేపడతారు.

ys jagan to go pulivendula tomorrow for five day tour skip assembly session

జగన్ మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అంటే కనీసం 11 గంటలకు అయినా బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. ఆలోపు జగన్ అసెంబ్లీకి స్పీకర్ ను అభినందించేందుకు వస్తారా రారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్టుకు వెళ్లనున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందులల చేరుకుంటారు. అక్కడే మూడు రోజుల పాటు ఉంటారని వైసీపీ ప్రకటించింది. అయితే పులివెందుల టూర్ లో జగన్ ఏం చేయబోతున్నారో మాత్రం వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+