జగన్ ట్రాప్ లో చంద్రబాబు, పవన్ - కీలక మలుపు..!!

ఏపీ ఎన్నికల్లో అసలైన ఘట్టం మొదలైంది. ఈరోజుతో ప్రచారం ముగియున్నది. పోలింగ్ ముందు ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. అభ్యర్థులు పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ పైనే ఫోకస్ చేశారు. ఎన్నికల్లో జగన్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ కీలకంగా మారుతుంది. అనూహ్యంగా చివరి నిమిషంలో జగన్ వేసిన స్కెచ్ లో కూటమి నేతలు చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో, చివరి నిమిషంలో లెక్కలు మారుతున్నాయి.

కొత్త వ్యూహాలతో
ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ చాలాకాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఏకంగా 81 మంది సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశారు. ఇతర పార్టీలకంటే ముందుగానే ప్రచార బరిలోకి దించారు. వై నాట్ 175 అంటూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. తాను అందించిన సంక్షేమం, అమలు చేసిన సామాజిక న్యాయం కలిసి వస్తాయని నమ్మకంతో ఉన్నారు. జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ తో చంద్రబాబు సైతం కొన్నిచోట్ల స్థానిక సమీకరణల ఆధారంగా అభ్యర్థులను మార్పు చేసుకోవలసి వచ్చింది. జగన్ తన తుది జాబితా ప్రకటించిన తర్వాత అభ్యర్థుల్లో మార్పు చేయలేదు. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులను మార్పులు చేర్పులు కొనసాగించారు.

YS Jagan Trap for Chandra Babu and Pawan Kalyan ahead polling big turn in Godavari Dists

మారుతున్న సమీకరణాలు
ఇప్పుడు కూటమిలో ఓట్ల బదిలీ ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. జనసేన నుంచి పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తొలిసారి బరిలో నిలిచిన వారు కావడంతో పోల్ మేనేజ్మెంట్ ప్రధాన అంశంగా మారుతుంది. స్థానికంగా ఉన్న టిడిపి సీనియర్లు వారికి ఈ చివరి నిమిషంలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తారు అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. మూడు పార్టీల కూటమిగా పోటీ చేస్తున్నా పరస్పర సహకారం.. ఓట్ల బదిలీ అనుకున్న విధంగా అమలు కాకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. వైసిపి ఈ వ్యవహారంలో ముందునుంచి పక్కా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతుంది. ఇక ఎన్నికల్లో కీలకమైన సంక్షేమ ఓట్ బ్యాంకు విషయంలో జగన్ తన మార్కు రాజకీయం ప్రదర్శించారు.

YS Jagan Trap for Chandra Babu and Pawan Kalyan ahead polling big turn in Godavari Dists

జగన్ మార్క్ రాజకీయం
పెన్షన్ల పంపిణీ వ్యవహారం నుంచి వాలంటీలను తప్పించడం జగన్ పూర్తిగా అనుకూలంగా మలుచుకున్నారు. రెండు నెలలపాటు పెన్షనర్లు ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబు ఆయన టీమ్ అంటూ ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు వాలంటీర్లకు వేతనాలు.. ఇంటి వద్దకే పెన్షన్ వంటి హామీలు ఇవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా తాజాగా డిప్యూటీ పథకాల నగదు బదిలీ ఆగటానికి కారణం చంద్రబాబు చేసిన కుట్ర అంటూ జగన్ సభల్లో ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లకాలంగా తాను పథకాలు అమలు చేస్తున్నానని.. చంద్రబాబు చేసిన ఫిర్యాదులు కారణంగానే ప్రస్తుతం రావలసినవి ఆలస్యం అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ ప్రచారం లబ్ధిదారుల పైన ప్రభావం చూపుతుంది. దీంతో జగన్ అనుకున్నట్లుగా సంక్షేమ ఓట్ బ్యాంక్ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. ఈ ఓట్ బ్యాంక్ పూర్తిగా తనకు అనుకూలంగా ఉంటుందనేది జగన్ నమ్మకం. అదే జరిగితే జగన్ కు మరోసారి అధికారం ఖాయమని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+