కేసీఆర్ వల్ల యుద్ధాలే జరుగుతాయేమో: రూటుమార్చిన జగన్, అందుకేనా?

విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు! ప్రత్యేక హోదా నుంచి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన ఆయన ఇప్పటి దాకా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైనే దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు.

తాజాగా, కర్నూలు జిల్లాలో చేపట్టిన దీక్షలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను నిలదీస్తూనే చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ తప్పు చేస్తున్నాడని, దానిని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

అయితే, గతంలో కంటే భిన్నంగా కేసీఆర్ పైన తీవ్రంగా నిప్పులు చెరిగారు. అది రాజకీయ వ్యూహమైనా, మనస్ఫూర్తిగా తిట్టినా.. కేసీఆర్‌పై జగన్ నిప్పులు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్‌ను హిట్లర్ అని, భారత్ - పాకిస్తాన్ పరిస్థితి తేవొద్దని, అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు ఎవడబ్బ సొమ్మని, కేసీఆర్ అన్నీ అబద్దాలే చెబుతారని దుయ్యబట్టారు.

తన ప్రసంగంలో జగన్ పదేపదే కేసీఆర్‌ను నిలదీశారు. అయితే, చంద్రబాబును విమర్శించే తన తీరుకు భిన్నంగా.. అప్పుడప్పుడు ఏపీ సీఎం పేరును ప్రస్తావించారు. తద్వారా చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు.

ప్రతి అంశానికి జగన్.. చంద్రబాబునే టార్గెట్ చేసుకోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యల విషయాన్ని పక్కన పెడితే... ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, తెలంగాణ ప్రాజెక్టులు కట్టినా జగన్.. చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.

 YS Jagan tries to corner Chandrababu with KCR

ఈ విషయాల్లో చంద్రబాబును టార్గెట్ చేయడంలో తప్పులేదని, కానీ కేవలం చంద్రబాబునే టార్గెట్ చేయడాన్ని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన జగన్ రూటు మార్చినట్లుగా కనిపించింది. ఈ కారణంగానే జగన్ ఈసారి కేసీఆర్‌ను తిడుతూ బాబును కార్నర్ చేసే ప్రయత్నం చేశారంటున్నారు.

బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతోంది: జగన్

బ్రహ్మంగారు అప్పుడెప్పుడో చెప్పారని, నీళ్ల వలనే యుద్ధాలు జరుగుతాయని చెప్పారని, నిజంగా ఇవాళ కేసీఆర్ పాలన చూస్తుంటే నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనని భయాందోళన కలుగుతోందని జగన్ అన్నారు. ఆయన పాలన యుద్ధానికి దారితీసేట్టుందన్నారు.

ఈ జలదీక్షతోనైనా ఆయనలో మార్పు రావాలన్నారు. మనమంతా ఒకటిగా కలిసి అక్రమ ప్రజెక్టులపై యుద్ధం ప్రకటించాలన్నారు. నేతల్లో మార్పు రావాలని, మనందరమూ కలిస్తేనే వీరిలో మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా చెబుతున్నానని జగన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+