'కేసీఆర్‌తో కలిసి ఏపీలో సంక్షోభానికి జగన్ కుట్ర, పెట్టుబడులకోసమే తెరాస'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెరాస అధినేత కేసీఆర్‌తో చేతులు కలిపాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో సంక్షోభాన్ని సృష్టించేందుకు జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిశారని ఆరోపించారు. కుట్రలో తెరాస ప్రభుత్వం ప్రమేయం కూడా కనిపిస్తోందన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార యంత్రాంగాన్ని తెరాస వినియోగించుకుందన్నారు. ఏపీని అస్థిరపరిచే కుట్రకు తెరాస తెరలేపిందన్నారు. కోర్టుకు ఇచ్చిన టేపులు ఎలా బయటకు వచ్చాయో చెప్పాలన్నారు.

కేసీఆర్ కుటుంబం పైన సీబీఐ విచారణ జరిపించాలని మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారన్నారు. తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏపీని తెలంగాణ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తోందని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి తెరాస పాల్పడుతోందన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని కుట్ర చేస్తున్నారన్నారు. కోర్టుకు అప్పగించామన్న టేపులు బయటకు ఎలా వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications