వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాసన్, జగన్ ఆస్తుల జఫ్తు: ట్విట్టర్లో ఫ్యాన్స్, వ్యతిరేకుల ఫైట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ట్విట్టర్‌లో చేరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో పెద్ద ఎత్తున విమర్శలు, ప్రశంసలు వస్తున్నాయి.

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఎవరు కారణం? మోసం చేసిన చంద్రబాబు? విఫలమైన అతని ప్రభుత్వానిదా? లేదా చంద్రబాబును నిలదీయని ఈ సొసైటీదా' అని ట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

జగన్ మద్దతుదారులు అతనికి అనుకూలంగా మాట్లాడితే, విమర్శకులు నిప్పులు చెరగుతున్నారు. జగన్ ట్విట్టర్‌లో చేరడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా స్వాగతించిందని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ మద్దతుదారులు ఆయన చేసిన ట్వీట్‌ను సమర్థిస్తున్నారు.

YS Jagan tweet sparks row on twitter

కాగా, ఈడీ జగన్ కేసులో ఈడి రూ.232 కోట్ల ఆస్తులను జప్థు చేసిన విషయం తెలిసిందే. భారతీ సిమెంట్ కార్పోరేషన్ ప్రయివేట్ లిమిటెడ్, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండియా సిమెంట్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెండ్, జగతీ పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తులను జఫ్తు చేసింది.

ఇందులో 6.3 కోట్ల రూపాయల విలువైన 5 స్థిరాస్తులు, 226 కోట్ల రూపాయల విలువైన 24 చరాస్తులు ఉన్నాయి. కడప, విశాఖ, బెంగళూరు, హైదరాబాదులోని పంజాగుట్ట, అనంతపురం తదితర ప్రాంతాల్లోని స్థిర, చరాస్తులను జఫ్తు చేసింది. ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్‌కు చెందినదనేది తెలిసిన విషయమే.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy's first tweet has sparked a cyber war between his supporters and opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X