చంద్రబాబుకు జగన్ అల్టిమేటం - ఇక సమరమే..!!

ఏపీలో వైసీపీ కేడర్ పైన జరగుతున్న దాడులు..తాజాగా నంద్యాల జిల్లాలో హత్య పైన మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించినా మార్పు కనిపించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం మారిన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన స్పందించారు. రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. తాము బాధితులకు అండగా ఉంటూ..పోరాటాన్ని కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేసారు.
.
జగన్ ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. నంద్యాల, జగ్గయ్యపేటలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. " ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.." అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

YS Jagan ultimatum for AP Govt over latest attacks on YCP Cadre in Nandyal

పోరాటం చేస్తాం
దీనికి కొనసాగింపుగా.. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను @ncbn నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, @YSRCParty నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం.." అంటూ జగన్ హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ తాజా పరిణామాల పైన పార్టీ నేతలతో చర్చించారు.


పార్టీ నేతలతో మంత్రాంగం
ఏపీలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేసారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. ఏపీలో వరుస పరిణామాల పైన వినుకొండ, కడపలో జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు తాజా పరిణామాల పైన పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అమరావతి తిరిగి వచ్చిన తరువాత జగన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు. భవిష్యత్ ప్రణాళికల పై జగన్ పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+