ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌దే హవా
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ చేతులు కలపడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అధికార వైసీపీని ఢీ కొట్టడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. మరోవైపు ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన తమదే మరోసారి అధికారమని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో .. ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ రెడీ అవుతున్నారు. సిద్ధం పేరిట నిర్వహించిన కార్యక్రమాలతో పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిన జగన్ , ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. దీనిలో భాగంగానే జిల్లాల వారీగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటేఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టిన గోదావరి ప్రజలు, 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ రెండు జిల్లాల్లో విజయం సాధింస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కూటమి ఈ రెండు జిల్లాలపై చాలానే ఆశలు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ అండతో మెజార్టీ సీట్లలో విజయం సాధించవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం జగన్ గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెండు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, ఇతర పథకాలతో పాటు పలు అంశాలపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన నేతలపై అధికార వైసీపీ గురి పెట్టినట్టు కనిపిస్తోంది.
దీనిలో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించింది. గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభంకు మంచి పట్టుంది. నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. ముద్రగడ పద్మనాభంను చేర్చుకోవడం ద్వారా కాపులకు మరింత దగ్గర కావాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక టీడీపీ కీలక నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీకి వైసీపీ గట్టి షాకే ఇచ్చింది.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నుంచి కూడా అధికార పార్టీలోకి భారీగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. జనసేనలో టికెట్ దక్కని నేతలతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. దీంతో అటు టీడీపీతో పాటు, ఇటు జనసేనకు సైతం ఒకేసారి చెక్ పెట్టడానికి సీఎం జగన్ సిద్దమవుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఉభయ గోదావరి జిల్లాలో జగన్ హవానే కనిపిస్తోంది. మరి రాబోవు రోజుల్లో జగన్‌ను ఎదుర్కొనడానికి రాజకీయ ప్రత్యర్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తారో చూడాలి.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications