నాయుడు ఫ్యామిలీకి జగన్ ఓదార్పు, బాబు సన్మానం
విజయనగరం/హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నై పదకొండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన ఉదయం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు.
జిల్లాలోని దత్తిరాజేరు మండలం కె కృష్ణాపురం వెళ్లి పతివాడ బంగారు నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులు అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ ధైర్యం చెప్పారు. జగన్ మంగళవారం ఏడు కుటుంబాలను ఓదార్చనున్నారు. జగన్ రెండు రోజులు జిల్లాలోనే ఉండనున్నారు.

సన్మానం చేసిన బాబు
ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు 112వ జయంతి వేడుకలు హైదరాబాదు అమీర్‌పేటలోని కమ్మ సంఘంలో జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘనంగా సన్మానించారు.
చంద్రబాబు నుంచి సత్కారం అందుకున్న వారిలో వై ధర్మారావు, ఆర్ఎస్ఎన్ మూర్తి, కేవీఎల్ నారాయణ రావు, సీఎల్ఎన్ శాస్త్రి, తిరుపతి రెడ్డి, ఏవీ అప్పారావు, ఎ కృష్ణారావు, బి రోశయ్య, కేవీ సుబ్బారావు, రౌతు సత్యనారాయణ, బీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications