హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య: జగన్ ఇలా (పిక్చర్స్), బాబు-కెసిఆర్‌లను లాగిన శ్రవణ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ బుధవారం వర్సిటీని సందర్శించారు.

విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మనమందరం ప్రశ్నించుకోవాలన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.

కాగా, విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రం మూర్ఖంగా వ్యవహరించి రోహిత్ చావుకు కారణమైందన్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌కు దత్తాత్రేయ, రామచంద్ర రావులే కారణమన్నారు. రోహిత్ మృతి పైన రెండు రాష్టాల ముఖ్యమంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తద్వారా ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలను లాగారు. వీసీని సస్పెండ్ చేయాలన్నారు.

నిరసన చేస్తున్న విద్యార్థులతో జగన్

నిరసన చేస్తున్న విద్యార్థులతో జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హెచ్‌సియులో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలుసుకున్నారు.

వైయస్ జగన్ ఆరా

వైయస్ జగన్ ఆరా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య విషయమై ఆరా తీస్తున్న వైసిపి అధినేత జగన్.

ప్రతిపాదిత స్థూపం ప్రాంతం వద్ద జగన్

ప్రతిపాదిత స్థూపం ప్రాంతం వద్ద జగన్

వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు వేముల రోహిత్ ప్రతిపాదిత స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

మాట్లాడుతున్న జగన్

మాట్లాడుతున్న జగన్

వేముల రోహిత్ బాధాకరమని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఆత్మహత్యపై మనలను మనం ప్రశ్నించుకోవాలన్నారు.

హెచ్‌సియు

హెచ్‌సియు

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి బుధవారం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యార్థులను పరామర్శించారు.

హెచ్‌సియు

హెచ్‌సియు

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి బుధవారం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన విద్యార్థులు.

ఏబీవీపీ ధర్నా

ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక నిందితులు తమ కార్యకర్తలేనన్న ఆరోపణలపై ఏబీవీపీ బుధవారం మండిపడింది.

ఏబీవీపీ ధర్నా

ఏబీవీపీ ధర్నా

'సేవ్ హెచ్‌సియు' పేరిట సరికొత్త రీతిలో ఏబీవీపీ హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగింది. రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏబీవీపీ ధర్నా

ఏబీవీపీ ధర్నా

ట్యాంక్ బండ్ పైన ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు... కుల, శవ రాజకీయాలు వీడాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.

English summary
YS Jagan Visits HCU, Expresses Solidarity with Striking Scholars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X