'గో బ్యాక్ జగన్': చేదు అనుభవం, జగన్ ఉన్న గదికి దూసుకెళ్లారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందిగామ ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు. జగన్ గో బ్యాక్ అని నినదించారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందిగామ ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు. జగన్ గో బ్యాక్ అని నినదించారు.
జగన్ ఉన్న గదిలోకి వారు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో నందిగామ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో పదిమంది వరకు మృతి చెందారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మలుపు వద్ద కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను పరామర్శించేందుకు జగన్ నందిగామ ఆసుపత్రికి వచ్చారు.
సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపికి పోటీగా వైసిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. టిడిపి కార్యకర్తల నినాదాలు, వైసిపి పోటీ నినాదాలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అంతకుముందు ఆసుపత్రి వద్ద జగన్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications