మోడీకి జగన్ ఎమోషనల్ ట్వీట్..! సీఈసీని వ్యతిరేకిస్తున్న వేళ..!

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గత కొన్నేళ్లుగా ప్రధాని మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. కారణాలు ఏవైనా, అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రధాని మోడీకి అండగా నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎన్నికల సంఘం, సీఈసీపై చేసిన విమర్శలతో వైఎస్ జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లిపోతారనే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ ప్రధాని మోడీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ పాతికేళ్ల ప్రజా సేవ పూర్తి చేస్తుకున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు.

కేంద్రంలో వారితో పొత్తుకు జగన్ సిద్దంగా ఉన్నారు - సాయిరెడ్డి..!!
కేంద్రంలో వారితో పొత్తుకు జగన్ సిద్దంగా ఉన్నారు - సాయిరెడ్డి..!!

ప్రధాని మోడీ ప్రజా సేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన పాతికేళ్లు పనిచేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బీజేపీకి చెందిన రాష్ట్ర, మంత్రులు, కేంద్రమంత్రులు, నేతలు, ఎన్డీయే పక్షాల నేతలు ప్రధానిని ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఎన్డీయే పక్షాల నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ట్వీట్ చేశారు.

YS Jagan Wishes PM Modi on 25 Years of Public Service Amid YSRCP s Opposition to CEC
కేంద్రాన్ని అడ్డుపెట్టి చంద్రబాబుకు జగన్ సిసలైన సవాల్..! హైకోర్టు తీర్పుతో..!
కేంద్రాన్ని అడ్డుపెట్టి చంద్రబాబుకు జగన్ సిసలైన సవాల్..! హైకోర్టు తీర్పుతో..!

ప్రజా సేవలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి, దీనిని విస్మరించకూడదంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి వైఎస్ జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ, మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని జగన్ తెలిపారు. మీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రధాని మోడీపై జగన్ ఆప్యాయత చెక్కుచెదరలేదని అర్థమవుతోంది. సీఈసీ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘంపై వ్యతిరేకత చూపిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత.. ప్రధాని మోడీ విషయంలో మాత్రం సానుకూలంగానే ఉన్నారని ఆయన ట్వీట్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+