చరిత్ర సృష్టించబోతున్నాం, ఇవీ మన సీట్ల లెక్క- జగన్ సంచలనం..!!
ఏపీలో కొత్త చరిత్ర క్రియేట్ కాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. ఐప్యాక్ టీంతో భేటీ అయ్యారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవ్వబోతోందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వివరించారు.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదిగా పేర్కొనారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2019 లో గెలిచిన 151 సీట్ల కంటే అధికంగా వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. 22 ఎంపీ సీట్లు వస్తున్నాయని లెక్క చెప్పారు. 2019 లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలిచింది. తిరిగి ఈ ఎన్నికల్లోనూ ఇదే సంఖ్య సాధిస్తామని జగన్ విశ్లేషించారు.

22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం..ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించి ఉండడు - YS JAGAN#YSJagan #YSRCP #PrashantKishor #ApElections2024 #AndhraPradeshElections2024 #ElectionResults2024 #Oneindiatelugu pic.twitter.com/4cJxTsI98P
— oneindiatelugu (@oneindiatelugu) May 16, 2024
ఎన్నికల తరువాత తొలిసారి స్పందించిన జగన్..తిరిగి సంచలన విజయం నమోదు చేయబోతున్నామని చెప్పారు. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారని జగన్ వివరించారు. ఐ ప్యాక్ టీమ్ సేవలు వెలకట్టలేనివన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామని వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాటమార్చారని జగన్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కలలోకూడా ఊహించని ఫలితాలు చూస్తామని జగన్ వివరించారు. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ గెలుపుపైన చేసిన కామెంట్స్..సీట్ల గురించి చెప్పిన లెక్కలతో ఏపీలో ఫలితాలపైన కొనసాగుతున్న ఉత్కంఠ వేళ సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications