జగన్ కేసు ఫిబ్రవరి 12కు: మాజీ మంత్రులు గైర్హాజరు

శాసన సభ ఉన్నందున...
తమకు శాసన సభ ఉన్నందున తాము న్యాయస్థానానికి హాజరు కాలేకపోతున్నామని మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణలు కోర్టుకు తెలిపారు.
కాగా, గత ఏడాది డిసెంబర్ 3న జగన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మంత్రి గీతా రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డిలు కూడా హాజరయ్యారు. జగన్ ఆస్తుల కేసులో పది ఛార్జీషీట్ల పైన సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది.
డిసెంబర్ 3న జగన్ కోర్టుకు హాజరైనప్పుడు తెలంగాణ సెగ తగిలింది. దీంతో అప్పుడు ఉద్రిక్తతల మధ్య జగన్ కోర్టుకు వచ్చి, వెళ్లిపోయారు. జగన్‌ను కోర్టులోకి వెళ్తుండగా తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. విచారణ వాయిదా పడిన అనంతరం జగన్ బయటకు వెళ్తుండగా మరోసారి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications