పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
ఈ ఎన్నికల్లో కడప రాజకీయం ఆసక్తి కరంగా కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీలోని ముఖ్యులు పోటీలో ఉన్నారు. కడప నుంచి షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా వైసీపీ అభ్యర్ది అవినాశ్ పైన పోటీ చేస్తున్నారు. ఎంపీగా అవినాశ్ కు పులివెందులలో వచ్చే మెజార్టీ కీలకం కానుంది. దీంతో...తన అన్న పోటీ చేస్తున్న పులివెందులలో జగన్ కు మెజార్టీ తగ్గించి..తద్వారా ఎంపీ ఎన్నికల్లో ఫైట్ టైట్ చేయాలేది షర్మిల లక్ష్యం. ఈ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు.
పులివెందుల రాజకీయం
వైఎస్ కుటుంబానికి కడప..పులివెందుల కంచుకోట. కడప నుంచి వైఎస్ఆర్, ఆ తరువాత బై పోల్ లో విజయమ్మ, 2014,2019 లో జగన్ విజయం సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి జగన్ పులివెందుల నుంచే పోటీ చేస్తున్నారు. కానీ, ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జగన్ సోదరి షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. షర్మిలకు ఎంపీగా పులివెందులో వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి. పులివెందులలో జగన్ గెలుపు ఖాయమే అయినా..మెజార్టీ తగ్గించటం ద్వారా అక్కడ అవినాశ్ కు ఓట్లు అ స్థాయిలో పోలవ్వకుండా షర్మిల కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. దీని ద్వారా పులివెందులలో జగన్ మెజార్టీ తగ్గించటం తో పాటుగా ఎంపీ ఓట్లలో క్రాస్ ఓటింగ్ దిశగా పావులు కదుపుతున్నారు.

షర్మిల ఎంట్రీతో
జగన్ పైన టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి, కాంగ్రెస్ నుంచి ధ్రువకుమార్‌రెడ్డి నిలిచారు. నియోజకవర్గంలో 2,23,453 ఓటర్లున్నారు. ఏడాది కిందట పులివెందుల టిడిపి అభ్యర్థిగా రవి పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టిడిపి అభ్యర్థి రవి సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరోవైపు జగన్ సోదరీమణులు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పులివెందులలో సాధించిన 91 వేల మెజార్టీ తగ్గించాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.
మెజార్టీ తగ్గేనా
జగన్ తరపున పులివెందులలో మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిషేక్‌రెడ్డి, వేంపల్లికి ఎస్‌వి సతీష్‌రెడ్డి, వేముల మరక శివరామిరెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, తొండూరు మండల ఎంపిపి రవిశంకర్ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. జగన్ రేపు (గురువారం) నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన సతీమణి భారతి ప్రచారంలో పాల్గొంటున్నారు. మే 11వ తేదీ వరకు ప్రచారం కొనసాగిస్తారు. దీంతో..వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న రాజకీయంతో 2019 ఎన్నికల్లో అత్యధిక రికార్డు సాధించిన నేతగా జగన్ నిలిచారు. ఈ సారి జగన్ పులివెందులలో దక్కే మెజార్టీ పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications