వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..

దివంగత వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం కుటుంబంలో తగాదా నడుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఆయన సోదరి వైఎస్ షర్మిల విభేదిస్తున్నారని.. అన్నపై ప్రతీకారంగా షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక యజమాని ఆర్కే ఆదివారం తన 'కొత్త పలుకు' కాలమ్ లో వివాదాస్పద అభిప్రాయాలను రాసుకురావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అది చర్చనీయాంశం కావడం తెలిసిందే. కాగా, సదరు కథనంపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు..

ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ ముఖ్యనాయకురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆమె స్పందించారు. తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం బెంగళూరు నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

 ys sharmila condemns media stories of her Conflicts with cm brother jagan

''ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్‌ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా'' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. కాగా,

సీఎం జగన్ సోదరిగా, వైసీపీ ముఖ్యనాయకురాలిగా పాపులర్ అయినప్పటికీ, పార్టీ పరంగా ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఆంధ్రజ్యోతికి హెచ్చరిక నోట్ ను (లెట్ హెడ్ పై కాకుండా) తెల్ల కాగితంపై జారీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరలైన ఈ ప్రెస్ నోట్ నిజమైనదా? ఫేకా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే షర్మిల తన అధికారిక ట్విటర్ లోనూ ఈ నోట్ ను షేర్ చేయడంతో అనుమానాలకు చెక్ పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+