మలుపు తిరిగిన అమరావతి భూసేకరణ..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాజధాని అమరావతి మలి విడత భూసేకరణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఇప్పుడున్న భూములకు అదనంగా మరో 44,000 ఎకరాలను సేకరించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంటోంది.
దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా తిష్ట వేసిందని, పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ భూములతో కలిపి 54,000 ఎకరాల్లో అభివృద్ధి జరిగిపోయిందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని అన్నారు. ఇంకా అక్కడ భూమి లేనట్లుగా, అదనంగా మరో 44,000 ఎకరాలు సేకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు.

"మున్సిపాలిటీ కావాలా? అంతర్జాతీయ రాజధాని కావాలా?" అని చంద్రబాబు నేరుగా ప్రజలను బెదిరించేలా అడుగుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. 54,000 ఎకరాల్లో మున్సిపాలిటీ గురించే ఇప్పుడు మాట్లాడటమేంటని ఆమె అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల రైతులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. అన్నీ పోగా- ఇప్పుడు 700 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని మంత్రి నారాయణ చెబుతున్నారని గుర్తు చేశారు.
అసలు ఎంత భూమిని ఎవరికి కేటాయించారు? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు విభజించి ఇచ్చారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాజధానికి సంబంధించిన 54,000 ఎకరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. మింగడానికి మెతుకు లేదు గాని, ఇన్ని వేల కోట్ల అవసరమా? అని చెప్పారు. అమరావతిపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేకపోతే, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటిని అన్నారు.
భూములు ఇచ్చిన వారికీ న్యాయం చేయకుండా, ఇప్పుడు కొత్తగా మళ్లీ రైతులను బాధితులుగా మారుస్తారా? అని షర్మిల చెప్పారు. అమరావతి తొలి దశ భూములపై శ్వేతపత్రం ఇవ్వాలని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో విడత భూ సేకరణకు తాము వ్యతిరేకమని ఆమె తేల్చి చెప్పారు. అమరావతి నిర్మాణం కేంద్రం బాధ్యత అని, దాని నుంచి తప్పుకుందని అన్నారు. 11 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications