YS Sharmila: జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖలు-అసెంబ్లీ తీర్మానం కోరుతూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు తన అన్న తరహాలోనే ప్రత్యేక హోదా సహా కేంద్రం అమలు చేయని విభజన హామీల్ని టార్గెట్ చేస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఏపీకి చేసిన మోసానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని షర్మిల కోరారు.
ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు రాష్ట్ర ప్రజల హక్కని వైఎస్ షర్మిల తెలిపారు. బీజేపీ పదేళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం చేయాలని వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబుకు రాసిన లేఖల్లో కోరారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని కోరారు.

పీసీసీ అధ్యక్షురాలిగా ఈ లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని మీకు గుర్తు చేసేందుకు ఈ లేఖలు రాస్తున్నట్లు షర్మిల తెలిపారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రాల హక్కుల తీర్మానం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా డిమాండ్ చెయ్యాలని కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేండ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని షర్మిల తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచినట్లు ఆమె గుర్తుచేశారు. కానీ విభజన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కనపెట్టేసిందన్నారు.
గతంలో టీడీపీ బీజేపీతో పొత్తులో ఉన్నా.. ఇప్పుడు జగన్ బహిరంగంగా మద్దతిస్తున్నా.. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదని షర్మిల ఆక్షేపించారు. ఆనాడు సిరి సంపదలు, సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశానికే అన్నపూర్ణగా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, నేడు అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అన్నిటికీ సంజీవని అని చెప్పిన మీ పార్టీ.. మళ్లీ మాతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరు ఉధృతం చెయ్యాలని కోరారు.
ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజల గొంతుకగా, వారి ఆశలకు దర్పణంగా, నిబద్దతతో విభజన హామీలపై కలిసి పోరాడదామని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నట్లు జగన్, చంద్రబాబుకు రాసిన లేఖల్లో కోరారు. ఇందులో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిచ్చారు. అలాగే, అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో మన రాష్ట్ర గళం విప్పాలని ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ఒత్తిడి తీసుకురావాలని, దీనికోసం కలిసిరావాలని చంద్రబాబును కోరారు.
అలాగే అమలు కాని విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నగర నిర్మాణం ఉన్నట్లు షర్మిల తెలిపారు. ఇవి కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications