పోలింగ్ వేళ తండ్రి వైఎస్సార్ ను తలుచుకుని వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అక్కడక్కడ ఘర్షణలు, దాడులు, ఉద్రిక్తతలతో ఏపీలో అనేక చోట్ల టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితులను చక్కదిద్దుతూ పోలింగ్ కొనసాగేలా చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి.
Recommended Video

పోలింగ్ నాడు వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్
ఈసారి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సమయంలో అన్ని పార్టీలలోనూ ఓటర్ దేవుళ్ళ తీర్పు ఏవిధంగా ఉండబోతుంది అన్న ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజున ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

రాష్ట్ర భవితను మార్చే ఎన్నికల పండగ వేళ, ఒకప్పడు మా తండ్రి డాక్టర్ స్వర్గీయ వైఎస్.రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఒక అపురూపమైన అనుభూతి. ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్మ నాన్న ఆశీస్సులు,దేవుడి దీవెన,ప్రజల ఆశీర్వాదం నాకున్నాయని… pic.twitter.com/9hUEcU0Njz
— YS Sharmila (@realyssharmila) May 13, 2024
కడప నుండి పోటీ చేయటం అపురూపమైన అనుభూతి
తాను తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి కూర్చున్న ఒక అరుదైన ఫోటోను జోడించి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో వైయస్ షర్మిల రాష్ట్ర భవితను మార్చే ఎన్నికల పండగ వేళ, ఒకప్పడు మా తండ్రి డాక్టర్ స్వర్గీయ వైఎస్.రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన కడప నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఒక అపురూపమైన అనుభూతి అని పేర్కొన్నారు.
ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని నమ్ముతున్నాను
ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ అమ్మ నాన్న ఆశీస్సులు,దేవుడి దీవెన, ప్రజల ఆశీర్వాదం నాకున్నాయని నమ్ముతున్నాను. అంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఒక మహత్తర పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇవాళ ఓటు వేసే ముందు, నాకు జన్మను మాత్రమే కాదు, అంతకు మించి స్ఫూర్తి, పోరాటపటిమ ఇచ్చిన మా తండ్రి, మహానేత, డా వైఎస్ రాజశేఖర రెడ్డిగారికి శ్రద్దాంజలి ఘటించి, ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని కూడా వైయస్ షర్మిల వెల్లడించారు.
ఒక మహత్తర పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇవాళ ఓటు వేసే ముందు, నాకు జన్మను మాత్రమే
— YS Sharmila (@realyssharmila) May 13, 2024
కాదు, అంతకు మించి స్ఫూర్తి, పోరాటపటిమ ఇచ్చిన మా తండ్రి, మహానేత, డా వైఎస్ రాజశేఖర రెడ్డిగారికి శ్రద్దాంజలి ఘటించి, అయన ఆశీర్వాదం తీసుకున్నాను pic.twitter.com/CJsnvV5yau
సోషల్ మీడియాలో షర్మిల పోస్ట్ వైరల్
ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన షర్మిల, ఆపై తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేస్తూ వైఎస్ షర్మిల పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications