విజయసాయిరెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల..! ఆప్యాయంగా ఆహ్వానం..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఇవాళ మాజీ ఎంపీ, కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇంటికి వెళ్లారు. తన కుమార్తె అంజలీ రెడ్డి పెళ్లికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన షర్మిల.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. తన కుమార్తె పెళ్లికి తప్పకుండా హాజరై ఆశీర్వదించాలని సాయిరెడ్డిని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి అందుకు సరేనన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు.

ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!
ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

"డాక్టర్‌ వైయస్సార్‌గారి మనుమరాలు, శ్రీమతి షర్మిలమ్మ కుమార్తె అయిన "చిరంజీవి అంజిలి" "Wedding Invitation" ఇచ్చి కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా శ్రీమతి షర్మిలమ్మ ఈరోజు ఆహ్వానించారు." అంటూ విజయసాయిరెడ్డి సంతోషంగా ఈ వార్తను పంచుకున్నారు. ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే పనుల్లో బిజీగా ఉన్న విజయసాయిరెడ్డి .. షర్మిలకు టైమ్ ఇచ్చి కలవడమే కాకుండా, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెతో కాసేపు ముచ్చటిస్తున్న ఫొటోలు షేర్ చేశారు.

ys Sharmila invites vijayasai reddy to daughter anjili reddy s marriage
 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

వైఎస్ షర్మిల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా దశాబ్దాల పాటు పనిచేసిన విజయసాయిరెడ్డి, అనంతరం వైఎస్సార్సీపీలో చేరి ఆయన కుమారుడు వైఎస్ జగన్ కు సైతం అండగా నిలిచారు. అయితే పార్టీ అధికారంలో ఉండగా
జగన్ తో పాటే ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత మాత్రం ఎంపీ పదవికి, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా కొత్త పార్టీ పెట్టే క్రమంలో జగన్ ను క్రైస్తవుడంటూ టార్గెట్ చేస్తున్నారు. అయినా షర్మిలపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. దీంతో స్వతహాగానే అన్న జగన్ తో విభేదాలు ఉన్న వైఎస్ షర్మిల.. విజయసాయిరెడ్డిని కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. మరోవైపు ఎన్ని విభేదాలు ఉన్నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్న జగన్ ను పిలిచిన షర్మిల.. ఇప్పుడు కూతురు పెళ్లికి మాత్రం పిలవకుండా దూరంగా ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+