వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు సర్వం సిద్ధం: పోలీసులకు లేఖ: ఆర్ కృష్ణయ్య మద్దతు?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మరో సంచలనానికి తెర తీశారు. తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగా- నిరుద్యోగుల సమస్యల తరఫున పోరాటానికి దిగారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా నిల్చున్నారు. ఉద్యోగాల నోటిఫికేసన్ కోసం నేరుగా కేసీఆర్ సర్కార్‌ను ఢీకొట్టబోతున్నారు. నిరుద్యోగ యువత తరఫున నిరాహార దీక్షకు పూనుకున్నారు.
Recommended Video
ఖమ్మంలో నిర్వహించిన సంకల్పసభలో ఇచ్చిన హామీ మేరకు మూడురోజుల పాటు నిరహార దీక్ష చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మూడురోజుల పాటు ఆమె నిరాహార దీక్ష కొనసాగుతుంది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఇందిరాపార్క్‌ను దీనికి వేదికగా చేసుకున్నారు. తెలంగాణ పీఆర్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్షా 91 వేలకు పైగా శాంక్షన్డ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటి కోసం వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరాహార దీక్షకు దిగనున్నారు.

అనుమతి ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏపూరి సోమన్న తదితరులు నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ సెంట్రల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కొద్దిసేపటి కిందటే లేఖక రాశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 11 గంటల వరకు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో స్పష్టం చేశారు.
తాను తలపెట్టిన నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల ప్రజా సంఘాలు, తటస్థ రాజకీయ పార్టీల నేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ వంటి నాయకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఆర్.కృష్ణయ్.. షర్మిల నిరాహార దీక్షకు నైతిక మద్దతు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications