కుమార్తె వివాహ వేదిక మార్పు పై షర్మిల కీలక ప్రకటన - యలహంక పై జగన్ అభ్యంతరంతో..!!

పీసీసీ చీఫ్ షర్మిల తన కుమార్తె వివాహ వేదిక పై కీలక ప్రకటన చేసారు. షర్మిల తన కుమార్తె అంజలి వివాహం బెంగళూరులోని యలహంకలో చేయాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు వెడ్డింగ్ కార్డ్సులోనూ ప్రచురించారు. అయితే, ఈ వేదిక పైన షర్మిల అన్న జగన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. తొలి నుంచి యలహంకలో వద్దని చెబుతున్నానని.. భద్రతా పరమైన కారణాలను ప్రస్తావించారు. దీంతో.. ఇప్పుడు షర్మిల తన కుమార్తె వివాహ వేదిక మార్పు పై స్పష్టత ఇచ్చారు.

తన కుమార్తె వైఎస్ అంజిలి వివాహ వేదికకు సంబంధించి వైఎస్ షర్మిలా కీలక ప్రకటన చేశారు. యలహంకలోని ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో వివాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకు న్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా స్పష్టత ఇచ్చారు. తనకు చెందని ఆస్తి కోసం ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం తనకు, తన పిల్లలకు వచ్చిందని పేర్కొన్నారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని తెలిపారు. తన పిల్లల హక్కు కావడంతో పాటు, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగిన ఇల్లు కావడంతో, తన కుమార్తె అంజిలి కోరిక మేరకు అక్కడే వివాహం జరిపించాలని భావించినట్లు వివరించారు.

 TTD కొత్త ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత - ఆ ఒక్కటే తేలాల్సింది..!?
TTD కొత్త ఛైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత - ఆ ఒక్కటే తేలాల్సింది..!?
ys-sharmila-made-a-key-announcement-regarding-the-wedding-venue-of-her-daughter-here-the-details

వేదిక మార్పు పై షర్మిల స్పష్టత

కాగా, సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని, అయితే తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న తన కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి తన కుమార్తె గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కుమార్తె అంజిలి వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా వివాహాన్ని జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని షర్మిల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో బంధుమిత్రు లు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాబోయే నవదంపతులపై తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని షర్మిల ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+