ముఖ్యమంత్రితో షర్మిల భేటీ - కీలక చర్చ..!!
ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. చంద్రబాబు అటు ఢిల్లీలో ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇటు జగన్ నెల్లూరు జైలులో పార్టీ నేత పిన్నెల్లిని పరామర్శించారు. తమ పార్టీ కేడర్ పైన జరుగుతున్న దాడుల పై ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఈ నెల 8న వైఎస్సార్ జయంతి ఉత్సవాల నిర్వహణ దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాల పై చర్చించారు. పార్టీ బలోపేతం పైన సూచనలు స్వీకరించారు. ఇదే సమయంలో ఈ నెల 8న విజయవాడలో షర్మిల తన తండ్రి వైఎస్సార్ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని కర్ణాటక ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తల్లి విజయమ్మ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను షర్మిల ఆహ్వానిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సిద్ధారామయ్య గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ డీకే శివకుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. అనంతరం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి… pic.twitter.com/kb1fI4tRcB
— YS Sharmila (@realyssharmila) July 4, 2024
ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఆహ్వానించారు. ఇటు వైసీపీ అధినేత జగన్ రేపు (శుక్రవారం) కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. 8న ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. పార్టీ శ్రేణులంతా వైఎస్ జన్మదిన వేడుకల్లో పాల్గొనున్నారు. 7వ తేదీ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. 8న ఉదయం వైఎస్సార్ కు నివాళి అర్పిస్తారని సమాచారం. అయితే, అదే రోజు సాయంత్రం షర్మిల నిర్వహించే వైఎస్ జయంతి ఉత్సవాలకు ఎవరెవరు హాజరవుతారు..షర్మిల ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications