ఏపీలో షర్మిల ఎంట్రీతో ఇక రణమే: కుమారుడి పెళ్లి నుంచి నేరుగా ఆంధ్రరత్న భవన్‌కు

విజయవాడ: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్‌ ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారుడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వైఎస్ షర్మిల కేవీపీ ఇంటికి కాకుండా అనూహ్యంగా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు షర్మిల.

అయితే పోలీసులు తమను అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు టర్న్ తీసుకున్నారు. షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లారు. గురువారం ఉదయం అక్కడి నుంచే ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బుధవారం రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు.

YS Sharmila reaches andhra ratna bhavan in vijayawada to participate chalo secretariat protest

మరోవైపు, ఛలో సెక్రటేరియట్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే, తొలుత షర్మిల కేవీపీ నివాసానికి వెళితే అక్కడ ఆమెను హౌజ్ అరెస్ట్ చేయాలని భావించారు. వెంటనే అలర్ట్ అయిన షర్మిల, కాంగ్రెస్ నేతలు.. ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. ముందస్తు అరెస్ట్‌ల నేపథ్యంలో బుధవారం రాత్రి ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఛలో సెక్రటేరియట్‌కి పార్టీ శ్రేణులతో షర్మిల కలిసి వెళ్లనున్నారు.

కుమారుడి పెళ్లి నుంచి నేరుగా : కుమారుడి పెళ్లి అనంతరం వైఎస్ షర్మిల ఏపీకి రిటర్న్ అయ్యారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపులపాడు మండలం అంపాపురం బయలుదేరారు. అక్కడ కేవీపీ నివాసం ఉండగా అక్కడే బస చేయాలని భావించారు. అయితే, పోలీసులు ఫాలో అవడంతో తన వ్యూహం మార్చేశారు షర్మిల. ఎట్టి పరిస్థితుల్లోనూ 'ఛలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని షర్మిల ప్రకటించారు.

కాంగ్రెస్ నేతలను నిర్బంధించడంతో వైసీపీ సర్కారుపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్‌లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? అని షర్మిల జగన్ సర్కారును ప్రశ్నించారు.

'నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి.. గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా?
మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే.. మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం. మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా.. బారికెడ్లతో బంధించాలని చూసినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు' అని షర్మిల తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+