వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్- వరుడు ఎవరంటే ?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (Ys Sharmila Reddy) ఏకైక కుమార్తె, మాజీ సీఎం వైఎస్సార్ మనుమరాలు వైఎస్ అంజలీ రెడ్డి పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల స్వయంగా ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో కుమార్తె పెళ్లి ఫిక్స్ అయిందని, వరుడు, కుటుంబ సభ్యులు ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్న వివరాలను షర్మిల వెల్లడించారు. ఇప్పటికే కుమారుడు రాజారెడ్డి పెళ్ళి చేసిన షర్మిల.. ఇప్పుడు కుమార్తె పెళ్లి కూడా పూర్తి చేసేస్తే పూర్తి స్దాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
తమ కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డి వివాహం, సోమల సుబ్బారెడ్డి - సోమల పద్మారెడ్డి కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి తో నిశ్చయమైన శుభవార్తను పంచుకోవడానికి తాను, తన భర్త అనిల్ కుమార్ ఎంతో సంతోషిస్తున్నామని వైఎస్ షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు , వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందినవారని షర్మిల తెలిపారు. మిత్రులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలను తాము కోరుకుంటున్నామని షర్మిల పేర్కొన్నారు.

My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
— YS Sharmila (@realyssharmila) September 6, 2026
All members of their… pic.twitter.com/50NEQkqT08
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డితో పోలిస్తే కుమార్తె అంజలీ రెడ్డి ఇప్పటివరకూ లో ప్రొఫైల్ లో ఉంటూ వస్తున్నారు. అంజలి ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో కానీ, ఈవెంట్లలో కానీ కనిపించింది లేదు. కేవలం కుటుంబ కార్యక్రమాల్లో మాత్రమే అంజని అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. రెండేళ్ల క్రితం అన్న రాజారెడ్డి పెళ్లి వేడుకల్లో మాత్రం అంజలీ రెడ్డి యాక్టివ్ గా కనిపించారు. ఆ తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ, బహిరంగంగా కానీ అంజలి కనిపించలేదు. ఇప్పుడు షర్మిల పెళ్లి ప్రకటన చేసిన తర్వాత అంజలీ రెడ్డి గురించి జనం ఆరా తీస్తున్నారు.














Click it and Unblock the Notifications