జగన్, షర్మిల ఒకే చోట...అయినా- వైఎస్సార్ ఘాట్ సాక్షిగా..!!

వైఎస్సార్ వర్థంతి వేళ పలువురు నివాళి అర్పించారు. వైఎస్సార్ 17వ వర్థంతి వేళ ఆయన తనయుడు మాజీ సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తండ్రికి నివాళి అర్పించి..ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి విజయమ్మ అక్కడే కుమారుడిని ఆప్యాయంగా ముద్దాడారు. అదే విధంగా పీసీసీ చీఫ్ షరమిల సైతం తల్లితో పాటుగా వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ప్రజల గుండెల్లో వైఎస్ ఇంకా బతికే ఉన్నారని పేర్కొన్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్ .. కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వేర్వేరుగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం మొదట వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి నేరుగా ఘాట్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో వైఎస్‌ విజయలక్ష్మి, సుధీకర్‌రెడ్డి ఘాట్‌ వద్దకు వచ్చారు. అందరూ కలిసి వైఎస్సార్‌ సమాధిపై పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి ఉద్వేగానికి లోనయ్యారు. వైసీపీ నేతలు.. వైఎస్ సన్నిహితులు పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. ఆ తరువాత వచ్చిన షర్మిల తన తండ్రికి నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కుమారుడు.. కుమార్తె ఇద్దరూ నివాళి అర్పించే సమయంలో విజయమ్మ పక్కనే ఉన్నారు. జగన్ ను దగ్గరకు తీసుకొని విజయమ్మ ఆప్యాయంగా ముద్దాడారు.

పవన్ జన్మదిన వేళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా - చంద్రబాబు, లోకేష్ సహా..దేవుడిచ్చిన అన్న..!!
పవన్ జన్మదిన వేళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా - చంద్రబాబు, లోకేష్ సహా..దేవుడిచ్చిన అన్న..!!
ys-jagan-sharmila-pay-separate-tributes-to-ysr-on-his-death-anniversay-at-idupulapaya-ghat-here-th

వైఎస్సార్ కు నివాళి

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన షర్మిల తరువాత తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ⁠కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో YSR ఇంకా బ్రతికే ఉన్నారని పేర్కొన్నారు. ⁠మరణం లేని మహానేత వైఎస్సార్ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని కొనియాడారు. వైఎస్ తన హయాంలో ప్రవేశ పెట్టిన ⁠జలయజ్ఞం, ఫీజు రీ ఎంబర్స్మెంట్, ఉచిత కరెంట్ ,ఆరోగ్య శ్రీ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని వివరించారు. ఈ పథకాలు పథకాలు మునుపెన్నడు ఏ నాయకుడు కూడా అమలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, వైయ‌స్‌ఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+