తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లల్లో బీఫ్ వడ్డింపునకు ప్లాన్?

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో నాన్ వెజ్ భోజన మెనూలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రాబోయే రోజుల్లో భోజనంలో గొడ్డు మాంసాన్ని చేర్చాలని యోచిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

ఈ విషయాన్ని సామాజిక న్యాయశాఖ మంత్రి వన్ని అరసు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. భోజనంలో బీఫ్ వడ్డించాలనే విజ్ఞప్తులు కొంతమంది విద్యార్థుల నుంచి అందుతున్నాయని, వీటిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని అన్నారు. సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సి ఉందని, ఆ తర్వాతే దీని అమలుపై ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు.

Tamil Nadu Plans to serve Beef in Govt Hostels following student requests in addition mutton chicken

చెన్నై సైదాపేట పరిధిలోని ఎంసీ రాజా సామాజిక న్యాయ హాస్టల్‌ను మంత్రి వన్ని అరసు సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న ఆహారం, ఇతర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు బీఫ్ వడ్డించే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులలో ఎక్కువ మంది ప్రస్తుతం వడ్డిస్తోన్న చికెన్, మటన్ భోజనంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు

మటన్ ధర అధికంగా ఉండటం వల్ల గొర్రె మాంసానికి బదులుగా గొడ్డు మాంసాన్ని కూడా మెనూలో చేర్చాలని పలువురు విద్యార్థులు మంత్రిని కోరారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో గొడ్డు మాసం తినడం సహజమేనని, అధిక పోషక గుణాలు ఉండటంతో పాటు మటన్ తో పోల్చి చూస్తే ధర కూడా తక్కువేనని ఆ విద్యార్థులు వివరించారు. ఈ విజ్ఞప్తులను సమీక్షించాల్సి ఉందని మంత్రి వన్ని అరసు తాజాగా వెల్లడించారు.

మెరుగుపడుతున్న బంగారం రేట్లు: మార్పులు- మార్కెట్లకు కళ
మెరుగుపడుతున్న బంగారం రేట్లు: మార్పులు- మార్కెట్లకు కళ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హాస్టల్ వంటకాల నియమ నిబంధనలను సవరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశీయ సంప్రదాయ వంటకాలను కొనసాగిస్తూనే సోమవారం నాడు బిర్యానీతో పాటు వారానికి ఒకసారి సరికొత్త నాన్ వెజ్ మెనూను విద్యార్థుల కోసం అమలు చేస్తున్నామని వివరించారు. మెనూలో బీఫ్ చేర్చాలన్న విషయంపై విద్యార్థుల మధ్య విభేదాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.

తమిళనాడులో అమెరికన్ కంపెనీ భారీ ప్రాజెక్ట్- దేశంలోనే మొదటిది
తమిళనాడులో అమెరికన్ కంపెనీ భారీ ప్రాజెక్ట్- దేశంలోనే మొదటిది

హాస్టల్‌లో భిన్న ప్రాంతాలు, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నందున ఆహార విషయంలో ఏకాభిప్రాయం సాధించడం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఎవరి భావోద్వేగాలు, ఆహారపు అలవాట్లను దెబ్బతీయకుండా అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఉన్నతాధికారుల సలహాలు తీసుకుని, అందరి అభిప్రాయాల మేరకే భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా.. ప్రభుత్వ వసతి గృహాల మెనూలో బీఫ్ చేర్చే ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు రావడంతో తమిళనాడులో రాజకీయ కాక మొదలైంది. దీనిపై పుతియ తమిళగం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె కృష్ణసామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. విద్యార్థులలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ.. బీఫ్ ను ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. బీఫ్ వడ్డిస్తే తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+