దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సహా 51 మందిపై రౌడీషీట్లు..!?
విజయవాడ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసాలకు దిగే వారి పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన.. దాడుల వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన వైసీపీ ముఖ్యులతో సహా మొత్తంగా 51 మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
టీడీపీ ఆఫీస్‍పై దాడి కేసులో నిందితులుగా ఉన్న 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని సీపీ రాజశేఖర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2021లో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుపై విచారణ జరిగింది. కాగా.. తాజాగా వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సహా 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. తాజాగా విజయవాడ శాప్ ఆఫీస్‍పైనా దాడి జరగటంతో ఈ ఘటనల పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆ
51 మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు
కాగా.. శాప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి ఘటనపై పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, సోషల్ మీడియా పోస్ట్లు, మీడియాలో ప్రసారమైన వీడియోలు, ఫోటోలను విశ్లేషించి నిందితులను గుర్తిస్తున్నారు. 260 మందిలో 45 మంది రౌడీషీటర్లు, 71 మంది ట్రబుల్ మాంగర్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో 46 మంది క్రీయాశీలక కార్యకర్తలు, 9 మంది శాంతి భద్రతల సస్పెక్ట్ షీట్ ఉన్నవారు, ఏడుగురు క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉన్నవారు, ఆరుగురు ఇతర సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు ఉన్నట్లు తేల్చారు. మిగిలిన 76 మంది వివరాలు సేకరిస్తున్నారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మేయర్, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు. మిగిలిన వారి విషయంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
