క్యాండీ క్రష్ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ క్యాజువల్ గేమ్స్: ఎక్స్‌బాక్స్ లో భారీ పునర్వ్యవస్థీకరణ

మైక్రోసాఫ్ట్ కు చెందిన ప్రముఖ గేమింగ్ డివిజన్ ఎక్స్‌బాక్స్ (Xbox) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. సంస్థలో అంతర్గతంగా కొనసాగుతున్న ప్రక్షాళనలో భాగంగా తాజాగా 268 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే దాదాపు 1,600 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది ఎక్స్‌బాక్స్. ఇప్పుడు మళ్లీ రెండో విడతగా లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం గేమింగ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ఎక్స్‌బాక్స్ నూతన సీఈఓగా ఆశా శర్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థను లాభాల బాటలో నడిపించడానికి ఖర్చుల తగ్గింపునకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఎక్స్‌బాక్స్ రీసెట్ పేరిట జరుగుతున్న ఈ సంస్కరణల వెనుక ప్రధాన ఉద్దేశం.. సంస్థ స్థిరత్వాన్ని పెంచడమేనని మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ చెబుతోంది. ఇతర గేమింగ్ కంపెనీలతో పోలిస్తే ఎక్స్‌బాక్స్ లాభాల మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం కూడా దీనికి ఓ కారణమైందని భావిస్తోన్నారు.

Microsoft Xbox Cuts Deep Again as several Roles Eliminated and Candy Crush will now in Casual Games

తాజా లేఆఫ్స్ వివరాలను ఎక్స్‌బాక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్ బూటీ వెల్లడించారు. ఉద్యోగులకు మెమో సైతం పంపించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అందులో పొందుపర్చారు. పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సంస్థను పటిష్టం చేయడమే ఎక్స్‌బాక్స్ రీసెట్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ లేఆఫ్స్ ప్రభావం హాలో స్టూడియోస్‌తో పాటు ఇతర ఫస్ట్ పార్టీ విభాగాలు, మైక్రోసాఫ్ట్ గేమింగ్ మేనేజ్‌మెంట్ పై పడనుంది.

తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లల్లో బీఫ్ వడ్డింపునకు ప్లాన్?
తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లల్లో బీఫ్ వడ్డింపునకు ప్లాన్?

గేమింగ్ స్టూడియోల బాధ్యతల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డ్యూటీ గేమ్‌ల తయారీదారు యాక్టివిజన్ కు వరల్డ్స్ ఎడ్జ్, రే స్టూడియోల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తోన్నారు. రాబోయే కొత్త హాలో గేమ్‌ డెవలప్మెంట్ బాధ్యతలను ఈ రెండు సంస్థలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. గ్రౌండెడ్ గేమ్‌కు కేరాఫ్ అయిన అబ్సిడియన్ స్టూడియోను బెథెస్డా సంస్థలో విలీనం చేయనున్నారు. ప్రస్తుత ప్రాజెక్టుల్లో మార్పులు ఉండట్లేదని, అవి యథాతథంగా కొనసాగుతాయని మాట్ బూటీ స్పష్టం చేశారు.

మెరుగుపడుతున్న బంగారం రేట్లు: మార్పులు- మార్కెట్లకు కళ
మెరుగుపడుతున్న బంగారం రేట్లు: మార్పులు- మార్కెట్లకు కళ

క్యాండీ క్రష్ గేమ్స్ తయారీ సంస్థ కింగ్ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ క్యాజువల్ గేమ్స్ విభాగాన్ని తీసుకువస్తోన్నారు. ఫోర్జో, ఫేబుల్ సిరీస్‌లపై దృష్టి సారించడానికి వీలుగా ప్లేగ్రౌండ్ గేమ్స్, టర్న్ 10 స్టూడియోలను ఒకే విభాగంగా విలీనం చేయనున్నారు. గతంలోనే కంపైలేషన్ గేమ్స్, డబుల్ ఫైన్ ప్రొడక్షన్స్ వంటి అయిదు స్టూడియోలను వేరు చేసిన ఎక్స్‌బాక్స్.. గేమ్స్ క్వాలిటీ మార్కెట్ గమనాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

మైక్రోసాఫ్ట్ డ్రీమ్ మెషీన్ లాంచ్- యాప్స్ కాలం ముగిసింది: సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ డ్రీమ్ మెషీన్ లాంచ్- యాప్స్ కాలం ముగిసింది: సత్య నాదెళ్ల

ఈ పునర్వ్వస్థీకరణ పరిస్థితిని సమీక్షించుకోవడానికి, ఉద్యోగులలో భరోసా నింపడానికి అక్టోబర్ 6వ తేదీన ఎక్స్‌బాక్స్ ఒక ప్రత్యేక టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించనుంది. జాయింట్ ఎక్స్‌బాక్స్ టీమ్ ఈ సమావేశం ఏర్పాటుకానుంది. అనుబంధ విభాగాలు, సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. భవిష్యత్తులో రూపొందించనున్న లైన్ అప్ గేమ్స్ గురించి చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+